NITI Aayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముఖ్యమంత్రులకు బాధ్యత లేదట.. మాజీ మంత్రి రవిశంకర్ ఫైర్

దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉంది. అయితే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకాలేదు

NITI Aayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముఖ్యమంత్రులకు బాధ్యత లేదట.. మాజీ మంత్రి రవిశంకర్ ఫైర్

Ravi Shankar Prasad

Ravi Shankar Prasad: నీతి ఆయోగ్ (NITI Aayog) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన ముఖ్యమంత్రులపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేకమని, బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో పాటు ఆరోగ్యం, స్కిల్ డవలప్‌మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం శనివారం జరిగింది. అయితే ఈ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు.

TDP Mahanadu 2023: ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం.. బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

నీతి అయోగ్ సమావేశానంతరం మీడియాతో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉంది. అయితే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకాలేదు. ఇంత పెద్ద సంఖ్యలో సీఎంలు హాజరుకాకుంటే, తమ రాష్ట్ర ప్రజల వాణిని వారు ఎలా వినిపించగలుగుతారు? ఇది చాలా దురదృష్టకరమని, బాధ్యతారాహిత్యమైన, ప్రజావ్యతిరేక చర్య’’ అని అన్నారు.