అనంత టీడీపీలో టికెట్ చిచ్చు : వైసీపీలోకి గోవిందరెడ్డి

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 10:13 AM IST
అనంత టీడీపీలో టికెట్ చిచ్చు : వైసీపీలోకి గోవిందరెడ్డి

ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీల అధినేతలకు కత్తి మీద సాములా మారింది. సీట్ల సర్దుబాటు సమస్యలు సృష్టిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కొందరు రెబెల్స్ గా మారుతుంటే, మరికొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. టికెట్ రాదని కన్ఫమ్ చేసుకున్న వాళ్లు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీలో అసంతృప్తులు భగ్గుమన్నాయి.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య

సీఎం చంద్రబాబు రాయదుర్గం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాల్వ శ్రీనివాసులుకు కేటాయించారు. రాయదుర్గం టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి.. చంద్రబాబు నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వారిద్దరు తీవ్రంగా వ్యతిరేకించారు. రాయదుర్గం టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తమకు కాకుండా వేరేవాళ్లకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

గోవిందరెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు విఫలయత్నం చేశారు. అయినా శాంతించని గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో అనుచరులతో కలిసి వైసీపీలో చేరతున్నట్టు గోవిందరెడ్డి ప్రకటించారు. గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేశారు. స్థానికంగా అందరిని కలుపుకుని పోయే నాయకుడిగా, సౌమ్యుడిగా పేరుంది.
Read Also : ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా