అంబానీ సూచించిన నత్వానీకి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్

సురేశ్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్‌ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 08:20 AM IST
అంబానీ సూచించిన నత్వానీకి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్

సురేశ్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్‌ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి

సురేశ్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్‌ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా? అంతా ట్రాష్‌.. అంటూ కొట్టి పారేస్తున్న వాళ్లకు.. నో..నో.. నో.. నత్వానీని మా పార్టీ కండువా కప్పి మరీ రాజ్యసభకు పంపిస్తున్నాం.. తప్పకుండా రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టిస్తాడు.. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాం కదా.. అధికారికంగా మా పార్టీ కండువా కప్పి పంపిస్తున్నామని.. ఇదీ ఎవరికీ తోచని వైసీపీ లాజిక్కు.. 

ఇప్పటి వరకూ సభ్యత్వాలు తీసుకోకుండానే రాజ్యసభకు వెళ్లిన వ్యాపారవేత్తలు:
రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి కావాలి. లేదంటే రాష్ట్రపతి నామినేట్‌ చేయడం ద్వారా సభ్యత్వం పొందాలి. అయితే వ్యాపారవేత్తలను రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశాలు దాదాపుగా ఉండవు. దీంతో ఇప్పటి వరకూ చాలామంది వ్యాపారవేత్తలు ఏదో ఒక పార్టీ బలంతో ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. వారంతా ఆయా పార్టీల సభ్యత్వం తీసుకోకుండానే ఇండిపెండెంట్‌గా చలామణీ అవుతుంటారు. తాజాగా ఏపీ నుంచి పోటీ చేస్తున్న పరిమల్‌ నత్వానీ కూడా గతంలో రెండు సార్లు ఇదే తీరులో రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ, ఈ సారి సీను మారింది. వైసీపీ సభ్యత్వం తీసుకోవడమే కాకుండా పార్టీ కండువా కప్పుకొని నామినేషన్ దాఖలు చేశారు నత్వానీ. దీని వెనుక పెద్ద కారణమే ఉందనే టాక్‌ ఇప్పుడు వినిపిస్తోంది. 

నత్వానీ ఇప్పుడు వైసీపీ సభ్యుడిగానే వ్యవహరించాలి:
రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు నత్వానీకి రాజ్యసభ ఇచ్చారు జగన్‌. కాకపోతే గతంలో వేరే పార్టీలిచ్చినంత ఈజీగా మాత్రం ఇవ్వలేదట. దీనికి పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటూ కండిషన్ పెట్టారంటున్నారు. జగన్ పెట్టిన కండిషన్ వెనుక పెద్ద కారణాలే ఉన్నాయంటున్నారు పార్టీ నేతలు. రాజ్యసభలో తమ నంబర్ తమకు నిలబడుతుంది. ఏదైనా కీలక బిల్లులు వచ్చినప్పుడు నత్వానీ కూడా వైసీసీ విప్‌నకు కట్టుబడాల్సి ఉంటుంది. అందుకే తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే రాజ్యసభకు పంపిస్తామని జగన్ స్పష్టం చేశారట. దీంతో నత్వానీ వైసీపి సభ్యుడిగా ఏపీ అసెంబ్లీ కోటాలో ఎన్నికైన సభ్యుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో రిలయన్స్‌ పెట్టుబడుల గురించి ప్రస్తావించారా?
మరోపక్క, రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కోరడంతో ఈ పనిని జగన్‌ చేసి పెట్టారు. అంబానీ అడిగిన పని చేయడం వల్ల రిలయన్స్‌ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ దిశగా ఆలోచించిన తర్వాతే జగన్‌ ఓ నిర్ణయానికి వచ్చారట. రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్ద పీట వేసేందుకు నత్వానీ లాంటి వారితో ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని భావిస్తున్నారట. కానీ, కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకే నత్వానీకి చాన్స్‌ ఇచ్చారని చెబుతున్నారు అయితే… రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ప్రధానంగా పార్టీ కండువా కప్పిన తర్వాతే నామినేషన్‌ వేయించారని అంటున్నారు. 

Also Read | YES BANK ఖాతాదారులకు ఊరట..సేవలు పునరుద్ధరణ