భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే : ఎంపీ కవిత
నిజామాబాద్ : 2019 తర్వాత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రోజురోజుకి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, భవిష్యత్తులో దేశ

నిజామాబాద్ : 2019 తర్వాత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రోజురోజుకి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, భవిష్యత్తులో దేశ
నిజామాబాద్ : 2019 తర్వాత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రోజురోజుకి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. #AskMPKavitha పేరుతో ట్విట్టర్ లైవ్ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. లైవ్‌లో ప్రజలు అడిగిన ప్రశ్నలక ఆమె సమాధానం ఇచ్చారు.
ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోయిందన్న కవిత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ తరహా పథకాలు దేశంలోనూ అమలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎంపీ నిధులు ఏడాదికి కనీసం రూ. 25 కోట్లు ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఆమోదించకపోవడం బాధాకరం అన్నారు. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలని కవిత ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తోందన్నారు.
నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిందని కవిత అన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్‌లో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉండవన్నారు. పసుపు బోర్డు కోసం పోరాటం కొనసాగుతోందన్నారు. విభజన సమస్యలు మొదలుకుని రాష్ట్రానికి కేటాయించే నిధుల వరకు ప్రధాని మోడీ తెలంగాణపై వివక్ష చూపించారని కవిత మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీతో పాటు ఇతర పార్టీలను కలుస్తామని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ముమ్మరం చేస్తామని కవిత చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.