ఎన్నికల సందడి : తెలంగాణ మున్సిపోల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Published By: madhu ,Published On : December 23, 2019 / 12:57 PM IST
ఎన్నికల సందడి : తెలంగాణ మున్సిపోల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికళ రానుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 
 

* 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. 
* 2020, జనవరి 07వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.
* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 10 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.
 

* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. 
* 2020, జనవరి 22న పోలింగ్.
* 2020, జనవరి 25న కౌంటింగ్.
* 2020, జనవరి 24 (రీ పోలింగ్ వస్తే)

డిసెంబర్ 30వ తేదీన డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి 2020 జనవరి 02వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 31వ తేదీన అఖిలపక్షంతో ఈసీ సమావేశం కానుంది. అనంతరం 2020, జనవరి 01వ తేదీన మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ జరుగనుంది. జనవరి 04వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. 

* రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాల్టీలు, 13 కార్పొరేషన్లున్నాయి.
* గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు.
 

* 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. 
* 8 వేల56 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇదివరకే తెలిపారు. 
* మున్సిపాలిటిలో అభ్యర్థి ఖర్చు రూ. లక్ష, కార్పొరేషన్‌లో అభ్యర్థి ఖర్చు రూ. లక్షా 50 వేలు మించకుండా ఉండాలన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే టీఆర్ఎస్ రెడీగా ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో పక్కా వ్యూహంతో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తూ..సూచనలు, సలహాలు అందచేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినట్లుగానే ఈ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగిస్తామంటున్నా ఆ పార్టీ నేతలు. ఇతర పార్టీల వారు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.