వైసీపీ ఫిర్యాదు : డీజీపీ వాహనంలో రూ.35 కోట్లు తరలించారు

వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 08:12 AM IST
వైసీపీ ఫిర్యాదు : డీజీపీ వాహనంలో రూ.35 కోట్లు తరలించారు

వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా

వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో టీడీపీకి లబ్ది కలిగేలా చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వెంటనే డీజీపీని తొలగించాలని వారు సీఈసీని డిమాండ్ చేశారు. ముగ్గురు ఐపీఎస్ లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా సీఎం చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఈ విషయాన్ని ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వివాదాస్పద జీవో తీసుకొచ్చారని సీఈసీకి ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాల్లోనే డబ్బుని నియోజకవర్గాలకు చేరవేస్తున్నారని.. డీజీపీ ఠాకూర్ తన వాహనంలో రూ.35 కోట్లు తరలించారని కంప్లయింట్ చేశారు.