ఫారం 7 పై నివేదిక కోరాము :  సీఈసీ 

10TV Telugu News

ఢిల్లీ :  17 వ లోక్ సభ  ఎన్నికల నగారా  మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా  మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓట్ల తొలగింపు, ఫామ్‌-7పై మాకు ఫిర్యాదులు అందాయి. ఓట్ల తొలగింపు అంశంపై దర్యాప్తు ప్రత్యేక బృందాన్ని పంపాము. బృందం నివేదికను ఇచ్చిన తరవాత చర్యలు తీసుకుంటాము. ఆయా రాష్ట్రాల సీఈవోల నుంచి వివరాలు కోరాం” సీఈసీ తెలిపారు. డేటా చౌర్యం కేసుపై ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిట్ ను  ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నాయి.