నిధులివ్వండి మహాప్రభో:  కేంద్ర మంత్రితో లోకేష్

  • Published By: chvmurthy ,Published On : January 30, 2019 / 02:57 PM IST
నిధులివ్వండి మహాప్రభో:  కేంద్ర మంత్రితో లోకేష్

ఢిల్లీ: ఉపాధిహామీ పధకంలో భాగంగా ఏపీకి రావాల్సిన వేతనాలు,మెటీరియల్ బకాయిలు వెంటనే విడుదల చెయ్యాలని  ఏపీ  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్ ని కోరారు.  రాష్ట్రంలో 346 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలు గా ప్రకటించిందని, ఆయా మండలాల్లో వేతనదారులను ఆదుకోవడానికి కేంద్రం సహకరించాలని ఆయన అన్నారు. కరువు మండలాల్లో వలసలు అరికట్టడానికి 150 రోజుల పనిదినాలు, ఎక్కువ మందికి పని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని లోకేష్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నవంబర్ 15,2018 తరువాత ఇప్పటి వరకూ వేతన బకాయిలు కేంద్ర ప్రభుత్వం విడుదల చెయ్యలేదని, వేతనాల రూపంలో 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని ఆ నిధులు వెంటనే విడుదల చేయ్యాలని ఆయిన మంత్రిని కోరారు. 

“గతంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు,మెటీరియల్ రూపంలో చెల్లించిన 2138 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది,వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చెయ్యాలి అని  ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు. 700 కోట్ల రూపాయిలు వేతనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అని కూడా లోకేష్ కేంద్ర మంత్రిని  కోరారు.