Vivekanand KP : రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు, అందుకే ఇలా- ఎమ్మెల్యే వివేకానంద్

Vivekanand KP : 10శాతం నిధులు కట్టాలని.. మంత్రి కేటీఆర్ ఒత్తిడి చేశారనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ORR బిడ్డింగ్ పై ఏ విచారణకైనా సిద్ధం అని మేము సవాల్ చేస్తున్నాం.

Vivekanand KP : రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు, అందుకే ఇలా- ఎమ్మెల్యే వివేకానంద్

Vivekanand KP (Photo : Twitter, Google)

Vivekanand KP – Revanth Reddy : ఓఆర్ఆర్ బిడ్డింగ్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. బీఆర్ఎస్ నేత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్.. తెలంగాణ పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ORR బిడ్డింగ్ పై రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా గాలి వార్తను బేస్ చేసుకోని ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు.

10శాతం నిధులు కట్టాలని.. మంత్రి కేటీఆర్ ఒత్తిడి చేశారనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. పీసీసీ చీఫ్ పదవిని అడ్డుపెట్టుకుని నాలుగు పైసలు వెనుకేసుకోవాలని రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడడు అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

Also Read..Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

” ORR బిడ్డింగ్ పై ఏ విచారణకైనా సిద్ధం అని మేము సవాల్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఆరోపణలు రేవంత్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి గండం వచ్చింది. కాంగ్రెస్ నాయకులంతా రేవంత్ ను పీసీసీ నుంచి తొలగించాలని ఏకం అయ్యారు. పీసీసీ పదవిని కాపాడుకునేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
కేటీఆర్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకే ఆరోపణలు.

111 జీవో ఎత్తివేయాలని లోకల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీర్మానాలు చేశారు. మరి వాళ్ళను సస్పెండ్ చేస్తారా? 111 జీవో ఎత్తివేయొద్దని జీవో ఉండాలని ఆ గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడే దమ్ము కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉందా? రఘునందన్ రావుకు దమ్ముంటే విచారణ చేయించాలి” అని సవాల్ విసిరారు ఎమ్మెల్యే వివేకానంద.

Also Read..Telangana : నల్లగొండ అభివృద్ది కోసం నా చివరి రక్తపుబొట్టు వరకు పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి