Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం లాగే ఇది కూడా పెద్ద కుంభకోణం, కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు- రేవంత్ రెడ్డి సంచలనం

Revanth Reddy : బండి సంజయ్, కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? దీని వెనక గూడుపుఠానీ ఏమిటి?

Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం లాగే ఇది కూడా పెద్ద కుంభకోణం, కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు- రేవంత్ రెడ్డి సంచలనం

Revanth Reddy

Revanth Reddy- ORR Tender : ఓఆర్ఆర్ టెండర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీల వైఖరిని ఆయన ఎండగట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లాగే ఇది కూడా పెద్ద కుంభకోణం అన్నారాయన. ఓఆర్ఆర్ మంత్రి కేటీఆర్ ధనదాహానికి బలైందని రేవంత్ రెడ్డి వాపోయారు.

కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీకి పాల్పడిందన్నారు. బేస్ ప్రైస్ లేకుండా ఓఆర్ఆర్ టెండర్లు పిలవడంపై మేం ప్రశ్నించామన్నారు. 30 రోజుల్లోగా 10శాతం, 120 రోజుల్లోగా పూర్తి డబ్బు IRB సంస్థ చెల్లించాలని నిబంధన ఉందన్నారు. మేం ప్రస్తావించిన నిబంధనలపై అలాంటి నిబంధనలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుకాయించారని రేవంత్ రెడ్డి చెప్పారు. డబ్బు చెల్లింపునకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.(Revanth Reddy)

నిబంధన ప్రకారం టెండర్‌ను రద్దు చేయాలి:
” అగ్రిమెంట్ లోని 20, 21 పేజీలో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేను చెప్పింది 10శాతమే. కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలి. ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. ఈరోజుతో 30 రోజుల గడువు ముగిసింది. నియమ నిబంధనలు ఉల్లంఘించిన IRB సంస్థ టెండర్ ను రద్దు చేయాలి. ఇప్పటివరకు రూపాయి చెల్లించని సంస్థ టెండర్ ను రద్దు చేయమంటే ప్రభుత్వం బుకాయిస్తోంది. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. ఆ మార్చిన నిబంధనలు ఏమిటో బయటపెట్టాలి.

Also Read..Karimnagar constituency: కరీంనగర్ లో కాంగ్రెస్ పూర్వవైభవం సాధిస్తుందా.. గంగుల ప్రత్యర్థి ఎవరు.. బండి మళ్లీ అసెంబ్లీకి పోటీచేస్తారా?

ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిదే:
లిక్కర్ దందా విషయంలో టెండర్ నిబంధనలు సరళీకృతం చేసి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందాలో 100 కోట్ల స్కాం చేసింది. ఓఆర్ఆర్ టెండర్ నిబంధనలు మార్చారా? ఢిల్లీ లిక్కర్ స్కాం లాగే ఇది కూడా పెద్ద స్కాం. నేను చెప్పింది, రఘునందన్ చెప్పింది ఒక్కటే. మరి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? దీని వెనక గూడుపుఠానీ ఏమిటి?

ఊచలు లెక్కపెట్టాల్సిందే:
మేం బయటపెట్టిన నిబంధనలు నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉంది. నిబంధనలు టెండర్ వచ్చిన సంస్థ కోసం మారిస్తే.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కాం లాంటిదే. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఓఆర్ఆర్ టెండర్ పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. సొంత ఎమ్మెల్యే ఫిర్యాదును బండి, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా.. లేదా? ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలి.. లేకపోతే అరవింద్ కుమార్ స్పందించాలి. దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్ పై ఉంది. అరవింద్ కుమార్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది.(Revanth Reddy)

బీజేపీలో ఉక్కిరిబిక్కిరి కావొద్దు:
తెలంగాణలో బీజేపీది మూడో స్థానమే అని వాళ్ల జాతీయ నాయకులే చెబుతున్నారు. కాంగ్రెస్ ను గెలవకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని, ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టంగా చెప్పారు. మేం ముందు నుంచి చెబుతున్నట్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. కేసీఆర్, మోదీ అవిభక్త కవలలు. ఇప్పటికైనా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉంది. కొందరు ఆవేశంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత అసలు సంగతి తెలుసుకున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది. బీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ తోనే సాధ్యం. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని నేను అందుకే చెప్పా. ఇప్పటికైనా భ్రమలు వీడి బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు కలిసి రావాలి. ఆలోచన చేసి మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకోండి.

సెక్యూరిటీ లేకుండా ఓయూకి వెళ్లగలరా?
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ను నేను ప్రశ్నిస్తున్నా. మైనారిటీ ఓట్లను మోదీకి తాకట్టు పెడుతున్నారు. దీన్ని మీరు ఎలా సమర్దించుకుంటారు? ఇప్పటికైనా ఈ విషయం మీకు విషయం అర్ధమైందా? అర్థం కాకపోతే అర్ధం చేసుకోండి. ఏ హామీలు అమలు చేశారని, ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని హరీశ్ రావు తమ పాలనను సమర్దించుకుంటారు. తాను స్వాతిముత్యం.. మామ ఆణిముత్యం అని అనుకుంటున్నారు. సెక్యూరిటీ లేకుండా హరీశ్, కేటీఆర్ ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలి. క్షేమంగా తిరిగివస్తే వాళ్లు చెప్పింది నిజమని ఒప్పుకుంటాం.

Also Read..Nizamabad Urban constituency: ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది.. గుప్త హ్యాట్రిక్ కొడతారా?

పొడుగుంటే సరిపోదు:
నిరుద్యోగ ఖాళీలపై సీఎం శాసనసభలో చెప్పింది అబద్దమా? గంటా చక్రపాణి గవర్నర్ కు ఇచ్చిన నివేదిక అబద్దమా? 110 నెలల్లో లక్ష 10వేల మంది పదవీ విరమణ చేశారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు ఇప్పటివరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. హరీశ్.. పొడుగుంటే సరిపోదు.. మెదడు కూడా ఉండాలి. అది మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదు.