కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 11:05 AM IST
కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులను కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం మానవత్వం లేదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన రెస్పాండ్ అయ్యారు.

ప్రజలు దు:ఖ సమయాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు సానుభూతి చూపించాలని సూచించారు. ఈ విషయంపై హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టి సారించి..పోలీస్ శ్రీధర్‌పై ప్రవర్తనపై సమీక్షించాలని కోరారు. అంతకుముందే..కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సంగారెడ్డి…ఏ ఆర్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ..డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటన దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్, పద్మ దంపతుల కుమార్తె సంధ్యారాణి. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం నారాయణ జూనియర్ కాలేజీలో సంధ్యారాణి అనే మొదటి సంవత్సరం చదువుతోంది. రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే తమ కూతురు మరణించిందని సంధ్యారాణి తల్లిదండ్రులు ఆరోపించారు.

Read More : ఉత్కంఠకు తెర : చంద్రబాబు నాయుడు అరెస్టు

కుమార్తెకు జ్వరం వచ్చి ఇబ్బంది పడుతుంటే.. కలవనీయకుండా చేయడంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రి ముందు మృతదేహంతో 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం ధర్నాకు దిగారు. దీంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. సర్దిచెప్పాల్సిన పోలీసులు సహనం కోల్పోయి కానిస్టేబుల్ శ్రీధర్ మృతురాలి తండ్రిని బూటుకాలితో తన్నారు. బలవంతంగా మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు.