కరీంనగర్‌లో టెన్షన్ : డ్రైవర్ బాబు అంత్యక్రియలపై ఆర్టీసీ జేఏసీ ప్రకటన

  • Published By: madhu ,Published On : November 1, 2019 / 08:51 AM IST
కరీంనగర్‌లో టెన్షన్ : డ్రైవర్ బాబు అంత్యక్రియలపై ఆర్టీసీ జేఏసీ ప్రకటన

కరీంనగర్ డిపో -2కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు. ఇతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వివిధ పార్టీల నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు జిల్లాకు వచ్చారు. తొలుత చర్చలు జరిపేంత వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబసభ్యులు చెప్పిన సంగతి తెలిసిందే. గురువారం(అక్టోబర్ 31,2019) నుంచి బాబు ఇంటి ఎదుటే అతడి మృతదేహాన్ని ఉంచి నిరసన తెలుపుతున్నారు.

రాత్రంతా రాజకీయ జేఏసీ నేతలు జాగారం చేశారు. చర్చలు మొదలు పెట్టాకే అంతిమయాత్రకు కదులుతామని కుటుంబ సభ్యులు, ఎంపీ సంజయ్, మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ నేతలు అల్టిమేటం జారీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో…2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలు బాబు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు.అనంతరం డ్రైవర్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. బాబు కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. 

బాబు మృతదేహంతో కరీనంగర్ డిపో – 2 బస్ డిపో వరకు  ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ జేఏసీ ఇచ్చిన బంద్ నవంబర్ 01వ తేదీ శుక్రవారం కొనసాగుతోంది. బాబు డెడ్ బాడీతో అక్టోబర్ 31వ తేదీ గురువారం రాత్రి ఎంపీ బండి సంజయ్, కార్మికులు బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు  భారీగా మోహరించాయి. 
Read More : పెళ్లి వేడుకల్లో DJ చిచ్చు : వరుడిని చితక్కొట్టిన వధువు బంధువులు