Rajasthan Politics: మాజీ సీఎం.. ప్రస్తుతం సీఎం.. సచిన్ పైలట్ టార్గెట్ ఎవరు?

అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత్తారు. వాస్తవానికి ఆయన రాజే అవినీతిని పైకి లేపినప్పటికీ సీఎం గెహ్లాట్‭నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది

Rajasthan Politics: మాజీ సీఎం.. ప్రస్తుతం సీఎం.. సచిన్ పైలట్ టార్గెట్ ఎవరు?

Sachin Pilot, Ashok Gehlot and Vasundhara Raje

Rajasthan Politics: రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ జ్వాలలు అప్పుడప్పుడు బయటికి కూడా వస్తూనే ఉంటాయి. ఈ కారణంగానే గెహ్లాట్ ప్రభుత్వంపై పైలట్ తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తప్పుకోవడం వంటివి జరిగిపోయాయి. అయితే ఇంత జరిగినా ఇద్దరి మధ్య యుద్ధం తగ్గకపోగా, నానాటికీ పెరుగుతూనే ఉంది.

Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?

అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత్తారు. వాస్తవానికి ఆయన రాజే అవినీతిని పైకి లేపినప్పటికీ సీఎం గెహ్లాట్‭నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. రాజే అవినీతి గురించి తాను ఏడాదిన్నర కిందటే లేఖ రాసినప్పటికీ సీఎం గెహ్లాట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పైలట్ అన్నారు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీని కలవర పెడుతున్న అమూల్ పాల వివాదం

ఇతర పార్టీల అవినీతిపై ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సహజమే అయినప్పటికీ.. సొంత పార్టీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవడం లేదని పైలట్ వ్యాఖ్యానించారు. పైగా ఈ విషయమై తాను మంగళవారం ‘ఒక రోజు నిరాహార దీక్ష’ చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఆదివారం మీడియాతో పైలట్ మాట్లాడుతూ ‘‘ఈ హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లలేము. మా దగ్గర ఆధారాలున్నాయి. మనం చర్యలు తీసుకోవాలి. వెంటనే దర్యాప్తు ప్రారంభించాలి. కొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్తబోతున్నాం. త్వరలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం, వీలైనంత తొందరగా చర్యలకు దిగాలి’’ అని అన్నారు.