Congress vs Congress: గెహ్లాట్ ప్రభుత్వానికి 15 రోజుల అల్టిమేటం ఇచ్చి అవినీతి నిరోదక యాత్ర ముగించిన పైలట్

గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.

Congress vs Congress: గెహ్లాట్ ప్రభుత్వానికి 15 రోజుల అల్టిమేటం ఇచ్చి అవినీతి నిరోదక యాత్ర ముగించిన పైలట్

Rajasthan Politics: సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేపట్టిన ‘జన సంఘర్ష్ యాత్ర’ (Jana Sangarsh Yatra)ను రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) సోమవారం ముగించారు. అయితే వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై గెహ్లట్ ప్రభుత్వం (Gehlot Govt) చర్యలు తీసుకునేందుకు ఆయన 15 రోజుల అల్టిమేటం ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో పైలట్ మాత్రం సొంత పార్టీ ప్రభుత్వానికే అల్టిమేటం ఇవ్వడం గమనార్హం.

Karnataka Suspense: సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా: డీకే శివకుమార్

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తేదని సచిన్ పైలట్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయినప్పటికీ పైలట్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఐదు రోజుల పాటు ‘జన సంఘర్ష్ యాత్ర’ పేరుతో యాత్ర చేపట్టారు. ఆ యాత్ర ఈరోజు ముగిసింది. ‘‘ఈ నెల లోపు మేం పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అయితే మేం ఏం చేసినా గాంధీ చూపించిన మార్గంలోనే చేస్తాం. అవినీతిపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఈ ప్రభుత్వంపై ప్రజలు చర్యలు తీసుకుంటారు’’ అని పైలట్ అన్నారు.

Karnataka Effect: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై మమతా బెనర్జీ ఫార్ములా

గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం సర్దిచెప్పింది. కానీ, ఇద్దరి మధ్య వైరం మాత్రం తగ్గడం లేదు. సమయం దొరికినప్పుడల్లా పైలట్ మీద గెహ్లాట్ మాటలతో విరుచుకుపడుతుంటారు. ఇక గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తీరు కొనసాగుతోంది.