Sanjay Raut: వీడియో కాన్ఫరెన్స్‭లో ఉద్ధవ్ థాకరే గురంచి పుతిన్, బైడెన్, కింగ్ చార్లెస్ చర్చించారట!

శివసేన చీలిపోయిన అనంతరం ఇరు వర్గాల మధ్య నువ్వా-నేనా అనే పోరు సాగుతోంది. దీనికి తోడు కర్ణాటకతో సరిహద్దు వివాదం ఇరు వర్గాల మధ్య పోరుకు మరింత ఆజ్యం పోసింది. ఈ వివాదంపై అసెంబ్లీ తీర్మానం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేసిన మర్నాడే సీఎం షిండే అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే రెండున్నరేళ్ల ఉద్ధవ్ ప్రభుత్వం ఈ వివాదాన్ని పట్టించుకోలేదని అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు.

Sanjay Raut: వీడియో కాన్ఫరెన్స్‭లో ఉద్ధవ్ థాకరే గురంచి పుతిన్, బైడెన్, కింగ్ చార్లెస్ చర్చించారట!

Sanjay Raut claims Putin, Biden, Charles discussing who is Uddhav Thackeray

Sanjay Raut: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ కింగ్ చార్లెస్.. ఈ ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్‭లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గురించి చర్చించారట. ఇంతకీ వీరు ముగ్గురు కలిసి ఏం చర్చిస్తున్నారట అంటే.. ఏక్‭నాథ్ షిండే ప్రభుత్వంపై ఉద్ధవ్ థాకరే పోరాటాన్ని గురించి చర్చిస్తూ ఆశ్చర్యపోతున్నారట. వీరు ముగ్గురే కాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ సైతం ఈ విషయమై ఆరా తీశారట. ఇంకో విషయం ఏంటంటే.. తమకు ఉద్ధవ్ థాకరేను ఎందుకు పరిచయం చేయలేదంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అడిగారట. ఈ విషయం భారత విదేశాంగ శాఖనో లేదంటే అమెరికా, రష్యా ప్రభుత్వాలో చెప్పలేదు. శివసేన (ఉద్ధవ్ వర్గం) సీనియర్ నేత సంజయ్ రౌత్ చెప్పారు.

Maha vs Karnataka: ముంబై ఎవడి బాబు సొత్తు కాదు, అదెప్పటికీ మహారాష్ట్రదే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రౌత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి రౌత్ ఈ వ్యాఖ్యలు సీరియస్ కోణంలో చేసినవి కావు. ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ గురించి బిల్ క్టింటన్ ఆరా తీసినట్లు స్వయంగా షిండే చెప్పిన అనంతరం రౌత్ ఇలా సెటైరికల్ కోణంలో వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. “బిల్ క్లింటన్‌తో నివసించే ఒక భారతీయుడు కొన్ని నెలల క్రితం నా వద్దకు వచ్చాడు. ఏక్‌నాథ్ షిండే ఎవరని, ఎంత పని చేస్తాడని తనను బిల్ క్లింటన్ అడిగినట్లు నాతో చెప్పాడు’’ అని అన్నారు.

Gautam Adani: మోదీ కాదట, రాజీవ్ గాంధీనట.. పారిశ్రామికవేత్తగా తన ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ అదానీ