Sanjay Raut: హీటెక్కిస్తున్న రౌత్ ఘాటు వ్యాఖ్యలు ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనట!

ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, అసెంబ్లీ విపక్ష నేత అయిన అజిత్ పవార్ సైతం రౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు

Sanjay Raut: హీటెక్కిస్తున్న రౌత్ ఘాటు వ్యాఖ్యలు ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనట!

Sanjay Raut derogatory remarks on Assembly, later says towards specific group

Sanjay Raut: ‘అసెంబ్లీలో దొంగల ముఠా’ అంటూ శివసేన (ఉద్ధవ్ థాకరే) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపివేస్తున్నాయి. వారం రోజుల క్రితం చేసిన ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రౌత్ మీద చర్యలు తీసుకునేందుకు ఈ విషయమై స్పీకర్ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి చేసినవి కావని, ప్రత్యేకంగా ఒక వర్గాన్ని అంటే పేరు ఎత్తకుండానే ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలని బుధవారం వివరణ ఇచ్చారు.

Pak: హోలీ శుభాకాంక్షలు చెప్పినందుకు ట్రోల్ అవుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

తాను కూడా శాసన శాఖలో సభ్యుడినని, అందరినీ ఉద్దేశించి తానలా వ్యాఖ్యానించనని రౌత్ అన్నారు. ‘‘నేను చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఉద్దేశించినవే. ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి అనలేదు. బహుశా ఇది వారికి కూడా తెలుసు. నేను ఎంపీని. శాసనసభ్యులందరినీ ఒకే ఘాటున కట్టడం సరి కాదు. అలా అని అసెంబ్లీలో అందరూ మంచివాళ్లే ఉండరు’’ అని అని సంజయ్ రౌత్ అన్నారు. నిజానికి ఏ వర్గం పేరు ఉచ్చరించకుండా అసెంబ్లీలో దొంగల ముఠా అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడంపై పార్టీలకు అతీతంగా విమర్శలు వస్తున్నాయి.

BJP-NCP: విపక్షాలకు షాకిస్తూ బీజేపీతో చేతులు కలిపిన శరద్ పవార్.. అంతటా శత్రువులమే కానీ అక్కడ కాదంటూ కామెంట్

ఇక ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, అసెంబ్లీ విపక్ష నేత అయిన అజిత్ పవార్ సైతం రౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోని 15 మంది సభ్యులతో ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రౌత్ మీద మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోనున్నారు.