అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకీ సీటు కేటాయిస్తాం : స్పీకర్

తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వల్లభనేని వంశీ... అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం సీటు కేటాయిస్తామని స్పీకర్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 04:48 AM IST
అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకీ సీటు కేటాయిస్తాం : స్పీకర్

తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వల్లభనేని వంశీ… అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం సీటు కేటాయిస్తామని స్పీకర్ అన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వల్లభనేని వంశీ… అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. దీంతో అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకీ సీటు కేటాయిస్తామని స్పీకర్ అన్నారు. తన విచక్షణాధికారంతోనే వంశీకి అవకాశం ఇచ్చానని తెలిపారు. అయితే సభలో వంశీ కూర్చున్న సీటు ఇంతకముందే వేరే సభ్యుడికి కేటాయించడంతో 181, 182, 183 సీట్లు ఖాళీగా ఉన్నాయని స్పీకర్ తెలిపారు.

అంతకముందు సభలో వంశీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పు బ్యాచ్ తనను టార్గెట్ చేసిందన్నారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియదన్నారు. తనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. టీడీపీలో తాను కొనసాగలేనన్నారు. తనను ప్రత్యేక సభ్యుడి కింద గుర్తించి..తన హక్కులను కాపాడాలని స్పీకర్ కు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు స్పీకర్ వంశీకీ సీటు కేటాయిస్తామని చెప్పారు. 

అసెంబ్లీని పవిత్రమైన దేవాలయంగా అభివర్ణించారు స్పీకర్. అసెంబ్లీని పార్టీ కార్యాలయంగా మార్చారనడం తప్పు అని.. ఆ మాటను టీడీపీ ఉపసంహరించుకోవాలన్నారు. మీ జాగీరా అని మాట్లాడుతున్నారని..ఇది ఎవరి జాగీరు కాదు..ప్రజలు ఎన్నుకొని ఇక్కడికి పంపించారని తెలిపారు. తన పరిమితలులు తనకు తెలుసు అని స్పీకర్ అన్నారు.