చంద్రబాబు హయాంలో కీలక పోస్టులో పనిచేసిన ఐపీఎస్ ను సస్పెండ్ చేసిన జగన్ ప్రభుత్వం

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 01:44 AM IST
చంద్రబాబు హయాంలో కీలక పోస్టులో పనిచేసిన ఐపీఎస్ ను సస్పెండ్ చేసిన జగన్ ప్రభుత్వం

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సస్పెన్షన్‌కు ఉన్న కారణాలు, ఆయన అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో తెలియజేస్తూ ప్రభుత్వం కొన్ని వివరాలను తెలియజేసింది. 

నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడు చేతన్‌ సాయికృష్ణ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించాడని ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని ప్రభుత్వం చెబుతోంది. 

విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపించింది. నాణ్యత లేని నిఘా పరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారని ఆరోపించింది. ఇది రాష్ట్రం, దేశ ద్రోహమని తన ఉత్తర్వుల్లో చెప్పింది. 

సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేనిదే విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌ను వీడి వెళ్లరాదని ఆదేశాలిచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వైసీపీ ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది. గతంలోనే ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం కొన్నాళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. ఇప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు మీద వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది.

* ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన జగన్ ప్రభుత్వం
* అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన
* చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు
* నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు 

* ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కు
* కుమారుడు చేతన్‌ సాయికృష్ణ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించాడని ప్రభుత్వం ఆరోపణ
* విదేశీ సంస్ధతో కుమ్మక్కై కాంట్రాక్టు ఇప్పించుకోవడం.. 
* అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అంటున్న ప్రభుత్వం 

* విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా..
* జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వ ఆరోపణ
* నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఏబీపై ప్రభుత్వం ఆరోపణ
* ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారంటున్న ప్రభుత్వం

* ఇది రాష్ట్రం, దేశ ద్రోహమని ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిన ప్రభుత్వం
* అనుమతి లేనిదే విజయవాడ హెడ్ క్వార్టర్స్‌ వీడి వెళ్లరాదని ఆదేశాలు