Sharad Pawar: అదానీ గ్రూప్ వ్యవహారంలో విపక్షాలకు షాకిచ్చిన శరద్ పవార్.. టార్గెట్ చేశారంటూ కామెంట్స్

దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను

Sharad Pawar: అదానీ గ్రూప్ వ్యవహారంలో విపక్షాలకు షాకిచ్చిన శరద్ పవార్.. టార్గెట్ చేశారంటూ కామెంట్స్

Sharad Pawar (file photo)

Sharad Pawar: హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూపుల ఆస్తులు పేకమేడల్లా కరిగిపోయాయి. అయితే అదానీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. దాన్ని ఆధారం చేసుకుని విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. అదానీకి ప్రభుత్వం అప్పనంగా వేలాది కోట్లు తగలబెట్టారని విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై జేపీసీని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంటు లోపలా, బయటా హంగామా చేస్తున్నాయి.

Vanakkam Modi: ‘గో బ్యాక్ మోదీ’కి ‘వనక్కం మోదీ’ అంటూ గట్టి కౌంటర్ అటాక్ చేసిన బీజేపీ

అయితే అదానీ గ్రూపుల వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకునే ప్రయత్నం తీవ్రంగా శ్రమిస్తున్న విపక్షాలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ షాక్ ఇచ్చారు. గౌతమ్ అదానీ గ్రూపును ‘టార్గెట్’ చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కేవలం హిండెన్‌బర్గ్‭నే కాకుండా విపక్షాల విమర్శల్ని ఉద్దేశించి పవార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు మెజారిటీ వాటా ఉన్న ఎన్‭డీటీవీకి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnataka Polls: బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కిచ్చా సుదీప్ సినిమాలు బ్యాన్ చేయాలట.. కోర్టులో పిటిషన్

‘‘ఇటువంటి ప్రకటనలు ఇతర వ్యక్తులు చాలా ముందుగానే ఇచ్చారు. కొన్ని రోజులు పార్లమెంటులో గందరగోళం జరిగింది, ముగిసింది. అయితే ఈసారి ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఏదో రిపోర్ట్ ఆధారంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈ వ్యక్తుల (హిండెన్‌బర్గ్) గురించి నేనైతే ఎప్పుడూ వినలేదు. వారి నేపథ్యం ఏమిటో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా గందరగోళం కలిగించే సమస్యలను వారు లేవనెత్తినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుందని గ్రహించాలి. ఈ విషయాలను మనం విస్మరించలేము. దీన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది’’ అని అన్నారు.

CM KCR : ఈసారి కూడా సేమ్ సీన్.. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం, కారణం ఏంటంటే..

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను’’ అని అన్నారు. అయితే పవార్ వ్యాఖ్యలపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.