BJP-NCP: విపక్షాలకు షాకిస్తూ బీజేపీతో చేతులు కలిపిన శరద్ పవార్.. అంతటా శత్రువులమే కానీ అక్కడ కాదంటూ కామెంట్

కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటున్నారు. అలాంటిది ఉన్నట్టుండి బీజేపీతో చేతులు కలిపారు

BJP-NCP: విపక్షాలకు షాకిస్తూ బీజేపీతో చేతులు కలిపిన శరద్ పవార్.. అంతటా శత్రువులమే కానీ అక్కడ కాదంటూ కామెంట్

Sharad pawar ties hands with bjp-ndpp govt in nagaland

BJP-NCP: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదు అంటారు. కొన్ని సార్లు శత్రుత్వం, కొన్ని సార్లు మిత్రుత్వం అనే ఈ మాట పక్కన పెడితే.. ఏక కాలంలో శత్రుత్వం, మిత్రుత్వం చేయొచ్చు. అంటే ఒక ప్రాంతంలో శత్రువులుగాను, మరొక ప్రాంతంలో మిత్రులుగాను ఉంటారన్నమాట. ఈ మధ్య రాజకీయాల్లో ఇది బాగా ట్రెండీగా కూడా ఉంది. ఉదాహరణకి.. కాంగ్రెస్ పార్టీ, సీపీఎంలను కనుక చూసుకుంటే.. కేరళలో కుస్తీ, మిగతా ప్రాంతాల్లో దోస్తీ చేస్తున్నాయి. ఇదే కోవలో పయనిస్తున్నట్లు ఉన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్.

Ind vs Pak at UNSC: పాకిస్తాన్ వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగేనన్న ఇండియా

కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటున్నారు. అలాంటిది ఉన్నట్టుండి బీజేపీతో చేతులు కలిపారు. నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ-ఎన్డీపీపీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చారు. ఈ మద్దతు గురించి పవార్ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘‘అంతటా శత్రువులమే, కానీ నాగాలాండ్ రాష్ట్రంలో కాదు’’ అని అన్నారు. ఆయన ప్రకారం.. దేశమంతటా బీజేపీ మీద పోరు చేస్తారు కానీ, నాగాలాండ్ రాష్ట్రంలో మాత్రం స్నేహం చేస్తారని కుండబద్దలు కొట్టారు.

Pak: హోలీ శుభాకాంక్షలు చెప్పినందుకు ట్రోల్ అవుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఈ రెండు పార్టీల స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోతాయి. అయితే చిత్రంగా మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్రంలో విపక్షం లేని ప్రభుత్వం ఏర్పడుతోంది.