Sharad Pawar: ఎన్సీపీ చీఫ్‭గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి మహేష్ భరత్ తపసే శనివారం ప్రకటించారు. ఈసారి కూడా ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నిక ద్వారా మరో నాలుగేళ్ల పాటు ఆయన ఎన్సీపీకి అధ్యక్షుడిగా ఉండనున్నారు. 1999లో ఈ పార్టీని స్థాపించినప్పటి నుంచి 23 ఏళ్లుగా పవారే అధ్యక్షుడిగా ఉంటున్నారు

Sharad Pawar: ఎన్సీపీ చీఫ్‭గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన శరద్ పవార్

Sharad Pawar unanimously re elected as the President of the NCP

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి మహేష్ భరత్ తపసే శనివారం ప్రకటించారు. ఈసారి కూడా ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నిక ద్వారా మరో నాలుగేళ్ల పాటు ఆయన ఎన్సీపీకి అధ్యక్షుడిగా ఉండనున్నారు. 1999లో ఈ పార్టీని స్థాపించినప్పటి నుంచి 23 ఏళ్లుగా పవారే అధ్యక్షుడిగా ఉంటున్నారు. శరద్ పవార్‭తో పాటు తారిక్ అన్వర్, పీఏ సంగ్మాలు కలిసి పార్టీ స్థాపించారు. ఆ సమయంలో వీరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాగా, కాంగ్రెస్ పార్టీతో విబేధించి ఒకేసారి బయటికి వచ్చిన ముగ్గురు ఈ పార్టీని స్థాపించారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 4 రోజుల పాదయాత్రలో 3 వివాదాలు