Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్

గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఈ యేడాదిలో మార్చిలో జీ-23 నేతలను థరూర్ కలిశారు. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని, అది పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందని థరూర్ రాశారు.

Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్

Shashi Tharoor to run for Congress president

Shashi Tharoor: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల రేసు ప్రారంభమైంది. పార్టీ సినియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‭ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రస్తుత అధినేత సోనియా నుంచి అనుమతి లభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయమై సోమవారం మధ్యాహ్నమే సోనియాతో థరూర్ భేటీ అయ్యారు. ఈ భేటిలో థరూర్ అభ్యర్థిత్వానికి సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఎన్నికల ప్రక్రియ ప్రకారమే ఈ ఎన్నికలు జరుగుతాయని, పార్టీ నుంచి ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చని థరూర్‭తో సోనియా స్పష్టం చేసినట్లు సమాచారం.

థరూర్ వెంట.. పార్టీ నేతలు దీపెందర్ హూడా, జై ప్రకాష్ అగర్వాల్, విజేంద్ర సింగ్‭లు ఢిల్లీలోని సోనియా నివాసానికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో థరూర్ పోటీ చేయనున్నట్లు కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ.. వాటిలో అంత స్పష్టత లేదు. మరొక వైపు పలు రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు రాహుల్ గాంధీని పార్టీ అధినేతగా తీర్మానాలు చేస్తుండడంతో.. అధ్యక్ష పదవి ఎన్నికపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఎట్టకేలకు ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అధ్యక్ష ఎన్నికలపై కూడా స్పష్టత వచ్చింది.

10 Tricks: ఇంటి సరుకులకే జీతం మొత్తం పోతుందా? అయితే సూపర్ మార్కెట్‭కు వెళ్లినప్పుడు ఈ 10 ట్రిక్స్ పాటించండి

గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఈ యేడాదిలో మార్చిలో జీ-23 నేతలను థరూర్ కలిశారు. మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని, అది పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందని థరూర్ రాశారు.

ఇక ఈ రేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఉన్నారనే కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విచిత్రంగా ఆ ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో ఈ విషయమై ఆయనను ప్రశ్నిస్తే.. తాను ఈ విషయాన్ని మీడియాలోనే చూస్తున్నానని చెప్పడం గమనార్హం. అయితే ప్రస్తుత రేసులో థరూర్‭ ప్రత్యర్థిగా ఆయన ఉంటారా లేదా చూడాలి.

Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్