Shatrughan Sinha: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు మోదీకి థాంక్స్ చెప్పిన టీఎంసీ ఎంపీ శత్రుఘన్ సిన్హా
‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే సామెతను ఆయన గుర్తు చేశారు. మోదీ చర్యలు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తులో దీని ఫలితాలు ఆయన చూస్తారని అన్నారు. అయితే ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కానప్పటికీ, విపక్షాల బలాన్ని పెంచుతాయని శత్రుఘన్ సిన్హా అన్నారు.

Shatrughan Sinha thanks to PM Modi for rahul's disqualification
Shatrughan Sinha: కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బీజేపీ మాజీ నేత శత్రుఘన్ సిన్హా కృతజ్ణతలు తెలిపారు. మోదీ తీసుకున్న ఈ చర్యల వల్ల రాహుల్ గాంధీ సహా విపక్షాలు మరింత బలోపేతం అవుతాయని, వచ్చే ఎన్నికల్లో మరో వంద సీట్లు ఎక్కువ గెలుస్తాయని ఆయన అన్నారు. ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే సామెతను ఆయన గుర్తు చేశారు. మోదీ చర్యలు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తులో దీని ఫలితాలు ఆయన చూస్తారని అన్నారు. అయితే ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కానప్పటికీ, విపక్షాల బలాన్ని పెంచుతాయని శత్రుఘన్ సిన్హా అన్నారు.
CM KCR : అప్పటివరకూ.. మహారాష్ట్రకు వస్తూనే ఉంటా-నాందేడ్ సభలో కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో దోషిగా తేలడంతో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు (disqualification) వేశారు. “కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.