Shiv Sena: సంజయ్ రౌత్‌ను తొలగించిన శివసేన.. ఆ స్థానంలో గజానన్‌కు అవకాశం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉన్నట్టుండి కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. మరాఠీ భాషా విభాగం సమావేశంలో పాల్గొనేందుకు శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) అయిన ఉద్ధవ్ ఠాక్రే గురువారం విధన సభకు వచ్చారు. ఈ సందర్భంలోనే ఈ అరుదైన దృశ్యం కనిపించింది.

Shiv Sena Ousts Sanjay Raut as Parliamentary Party Leader
Shiv Sena: సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut)ను శివసేన తొలగించింది. తొలగించడం అంటే పార్టీ నుంచి తొలగించడం కాదు. ఈ మాటకొస్తే, పార్టీ రెండుగా చీలి పిమ్మట అది ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Chief Minister Eknath Shinde) చేతిలోకి వెళ్లేపాటికే ఆయన తొలగిపోయారు. అయితే తాజాగా తొలగించింది పార్టీ నుంచి కాదు. పార్టీ పార్లమెంట్ (Parliamentary Party) బాధ్యుడిగా ఆయనను తొలగించారు. శివసేన పార్లమెంటరీ పార్టీకి చాలా కాలంగా సంజయ్ రౌతే చీఫ్‌గా ఉన్నారు. పార్టీ రెండుగా చీలిపోయిన అనంతరం కూడా రికార్డుల్లో ఆయన పేరే కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు షిండే ప్రకటించారు. కాగా, ఆ స్థానంలో లోక్‌సభ ఎంపీ గజానన్ కర్తికర్(Gajanan Kirtikar)ను నియమించారు.
తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా(Lok Sabha Speaker Om Birla), రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్(Rajya Sabha Chairman Jagdeep Dhankhar)లకు షిండే లేఖ రాశారు. శివసేన పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా గజానన్ కర్తికర్ను నియమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభలో మొత్తం 18 మంది శివసేన ఎంపీలు ఉండగా 14 మంది షిండే వైపుకు వెళ్లారు. ఇక కేవలం నలుగురు మాత్రమే ఉద్ధవ్ థాకరే వర్గంలో ఉన్నారు. దీంతో పార్టీ పార్లమెంటరీ విభాగాన్ని సైతం థాకరే కోల్పోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉన్నట్టుండి కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. మరాఠీ భాషా విభాగం సమావేశంలో పాల్గొనేందుకు శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) అయిన ఉద్ధవ్ ఠాక్రే గురువారం విధన సభకు వచ్చారు. ఈ సందర్భంలోనే ఈ అరుదైన దృశ్యం కనిపించింది.