Alliance Todo: రాహుల్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర కూటమిలో లుకలుకలు.. యూపీఏకు శివసేన గుడ్ బై!

కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే పాల్గొన్నారు. అయితే ఇంతలోనే సావర్కర్‭పై రాహుల్ విమర్శ చేయడం, దానిపై శివసేన తీవ్ర అసంతృప్తికి లోనవడం చకచకా జరిగిపోయాయి. సావర్కర్‭ను శివసేన స్ఫూర్తిదాతగా భావిస్తుంది. అలాంటి వ్యక్తిపై తీవ్ర విమర్శలు చేయడాన్ని శివసేన తప్పుబడుతోంది

Alliance Todo: రాహుల్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర కూటమిలో లుకలుకలు.. యూపీఏకు శివసేన గుడ్ బై!

shivasena may quit maha vikas agadi alliance over rahul remarks on savarkar

Alliance Todo: వీర్ సావర్కర్‭పై రాముల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ కూటమి విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బ్రిటిష్ తొత్తు, సేవకుడు అంటూ సావర్కర్‭ను తులనాడుతూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శివసేన బాగా నొచ్చుకుంది. దీంతో యూపీఏ కూటమి నుంచి వైదొలగాలని శివసేన భావిస్తున్నట్లు సమాచారం. కాసేపట్లో ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలోనే గుడ్‌బై చెప్పే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే పాల్గొన్నారు. అయితే ఇంతలోనే సావర్కర్‭పై రాహుల్ విమర్శ చేయడం, దానిపై శివసేన తీవ్ర అసంతృప్తికి లోనవడం చకచకా జరిగిపోయాయి. సావర్కర్‭ను శివసేన స్ఫూర్తిదాతగా భావిస్తుంది. అలాంటి వ్యక్తిపై తీవ్ర విమర్శలు చేయడాన్ని శివసేన తప్పుబడుతోంది. రాష్ట్రంలోని అకోలాలో విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘బ్రిటిషర్లకు వీర్ సావర్కర్ రాసిన లేఖలో ‘సర్, నేను మీకు నమ్మకైన బంటుగా ఇక నుంచి ఉంటానని మిమ్మల్ని వేడుకుంటున్నాను’ అని అన్నారు, అందులో ఆయన సంతకం కూడా ఉంది. బ్రిటిషర్లకు సావర్కర్ సహాయం చేశారు. అలాగే మహాత్మా గాంధీ, జవహార్‭లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారికి ద్రోహం చేశారు’’ అని విమర్శించారు.

రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ థాకరే ఖండించారు. సావర్కర్‭కు భారతరత్న ఇవ్వాలని, ఆయన దేశభక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సైతం ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూటమి విచ్ఛిన్నానికి కారణం అవుతుందని ఆయన ముందుగానే చెప్పారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేందుకు శివసేన సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ విషయాన్ని ధ్రువీకరించలేము.

2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. అయితే సీఎం కుర్చీ వద్ద ఇరు పార్టీలకు సయోధ్య కుదరలేదు. దీంతో బీజేపీని వీడిన ఉద్ధవ్ థాకరే.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అనంతరం బీజేపీ ప్రతీకారంతో ఉద్ధవ్ సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలను షిండేకు కోల్పోవాల్సి వచ్చింది. ఉద్ధవ్ దాదాపు ఒంటరివారైపోయారు. అయితే సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ యూపిఏకు గుడ్‌బై చెబితే తిరిగి ఎన్డీయేలో చేరే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Ukraine Without Electricity: రష్యా యుద్ధం మిగిల్చిన చీకటి.. యుక్రెయిన్‌లో కరెంట్ లేక అల్లాడుతున్న కోటి మంది ప్రజలు