విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. సర్పంచ్‌ పదవికి పోటీ

విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తోంది సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 03:14 PM IST
విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. సర్పంచ్‌ పదవికి పోటీ

విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తోంది సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.

నిజామాబాద్‌ : విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం… లక్షల్లో జీతం… ఇవేవీ వద్దనుకుంది. పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న తపనతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి… స్వదేశానికి తిరిగి వచ్చింది. సర్పంచ్‌ ఎన్నికల బరిలోకి దిగి పోటీకి సై అంటోంది. తాను గెలిస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెబుతోంది.

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లికి చెందిన సుస్మిత… ఐర్లాండ్ లో ఎంబీఏ పూర్తి చేసి… అక్కడే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగినిగా స్థిరపడింది. అయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు … ఆమెను ఐర్లాండ్‌ వదిలి స్వగ్రామానికి వచ్చేలా చేశాయి. పంచాయతీ ఎన్నికలలో ఈసారి ఎడపల్లి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. దీంతో సుష్మిత తన ఉద్యోగానికి రాజీనామా చేసి… స్వగ్రామానికి వచ్చి సర్పంచ్‌గా నామినేషన్‌ వేసింది. ఇంటింటికీ ప్రచారం చేస్తూ.. తన ఆలోచనా విధానంతో ఓటర్లను ఆకట్టుకుంటోంది.

సర్పంచ్‌ పదవికి పోటీ చేయడానికి తన తండ్రే ఆదర్శమంటోంది సుష్మిత. దాదాపు మూడు దశాబ్దాలుగా తన తండ్రి శంకర్‌ నాయుడు గ్రామాభివృద్ధికి పాటుపడం చూసి రాజకీయాలంటే ఆసక్తి పెరిగిందని చెబుతోంది. ప్రజా సేవలో తండ్రిని ఆదర్శంగా తీసుకొని … చిన్న వయస్సులో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటోంది. యువత రాజకీయాల్లోకి వస్తే మార్పు సాధ్యమవుతుందని… తనకు ఉన్న ఆలోచనలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ రూపురేఖలు మారుస్తానని చెబుతోంది సుస్మిత. ఎడపల్లి.. మేజర్‌ గ్రామ పంచాయతీ కావడంతో… ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్‌ బరిలో ఉన్నారు. మరి ఎడపల్లి ఓటర్లు.. ఐర్లండ్‌లో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన సుష్మితకు పట్టం కడతారా..?