Balineni Srinivas Reddy : సొంత పార్టీ వాళ్లే నన్ను ఇబ్బంది పెట్టారు- సీఎం జగన్‌తో భేటీ తర్వాత బాలినేని హాట్ కామెంట్స్

Balineni Srinivas Reddy : పార్టీలో కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లా. అన్ని సమస్యలు తీరతాయని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.

Balineni Srinivas Reddy : సొంత పార్టీ వాళ్లే నన్ను ఇబ్బంది పెట్టారు- సీఎం జగన్‌తో భేటీ తర్వాత బాలినేని హాట్ కామెంట్స్

Balineni Srinivasa Reddy

Balineni Srinivas Reddy : సొంత పార్టీలోని వారే కొందరు తనను ఇబ్బంది పెట్టారని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారితో తాను ఫైట్ చేశానని ఆయన చెప్పారు. సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ ముగిసింది. సీఎంతో భేటీ అనంతరం బాలినేని మాట్లాడారు.

Also Read..Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు.. ఘాట్ రోడ్ల విషయంలో టీటీడీ ఏం చేయాల్సి ఉంది!

” పార్టీలో కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లా. అన్ని సమస్యలు తీరతాయని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పార్టీలో విభేదాలను పరిష్కరిస్తానని సీఎం చెప్పారు. అలక ఏమీ లేదు. పార్టీలో కొందురు నన్ను ఇబ్బంది పెట్టారు. వారితో నేను ఫైట్ చేశారు. పార్టీ మారాల్సిన ఆలోచన నాకు లేదు. ఒంగోలులో ఇల్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు” అని సీఎం జగన్ తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు.

Also Read..Andhra Pradesh : విజయవాడలో కలకలం.. ఆ నలుగురు ఉద్యోగులు అరెస్ట్, ఆందోళనలో కుటుంబసభ్యులు

ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నేత అయిన బాలినేని కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు నెల రోజుల క్రితం బాలినేని.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. మళ్లీ ఇవాళ సీఎంతో భేటీ కావడం పార్టీ శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని కంటతడి పెట్టడం చర్చకు దారితీసింది. తాను వైసీపీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు.