Ramcharitmanas Row: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమాజ్‭వాదీ పార్టీ.. ఆ ఇద్దరు మహిళా నేతలపై వేటు

కోట్లాది ప్రజలు చదువుతున్న ఈ పుస్తకం (రామచరితమానస్) పూర్తి అబద్ధాలు, విధ్వేషంతో కూడుకొని ఉన్నది. తులసీదాస్ తన వ్యక్తిగత ప్రశంసల కోసం దీన్ని రాశారు. ఒకవేళ అలా కాదనుకుంటే మతం పేరుతో విధ్వేషం ఎందుకు రెచ్చగొట్టారు? దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళల్ని తీవ్రంగా అవమానించారు. కులం ఆధారంగా వారిని శూద్రులు అన్నారు. వారిపై విధ్వేష వ్యాఖ్యలు చేశారు

Ramcharitmanas Row: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమాజ్‭వాదీ పార్టీ.. ఆ ఇద్దరు మహిళా నేతలపై వేటు

SP leaders who criticised Swami Prasad Maurya’s Ramcharitmanas remarks expelled

Ramcharitmanas Row: రామచరితమానస్ మీద కాంట్రవర్సీ నడుస్తున్న వేళ సమాజ్‭వాదీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. రామచరితమానస్‭ను తప్పు పడుతూ విమర్శలు గుప్పించిన ఎస్పీ నేత స్వామి ప్రసాద్ వ్యాఖ్యలను వ్యతిరేకించిన ఇద్దరు మహిళా నేతలపై అఖిలేష్ యాదవ్ వేటు వేశారు. ఈ ఇద్దరు నేతల్ని క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కారణం బయటికి చెప్పకపోయినప్పటికీ వేటుకు గల అసలు కారణం రామచరితమానస్ కాంట్రవర్సీయేనని బహిరంగంగానే చర్చ జరుగుతోంది.

YouTube CEO: మరో అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా భారత సంతతి వ్యక్తి.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్

బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మొదట రామచరితమానస్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పుస్తకంలో దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలను ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారని, అది చెత్త గ్రంథమని అన్నారు. ఇది బిహార్ రాజకీయాలను కుదిపివేసింది. బిహార్‭లో దీనిపై వివాదం కొనసాగుతుండగానే, ఉత్తరప్రదేశ్‭లో ఈ చర్చకు మౌర్య ఆజ్యం పోశారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలకు వ్యతిరేకంగా రామచరితమానస్ ఉందంటూ వ్యాఖ్యానించారు.

IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు

జనవరి 22న ఒక టీవీ డిబేట్లో మౌర్య మాట్లాడుతూ ‘‘కోట్లాది ప్రజలు చదువుతున్న ఈ పుస్తకం (రామచరితమానస్) పూర్తి అబద్ధాలు, విధ్వేషంతో కూడుకొని ఉన్నది. తులసీదాస్ తన వ్యక్తిగత ప్రశంసల కోసం దీన్ని రాశారు. ఒకవేళ అలా కాదనుకుంటే మతం పేరుతో విధ్వేషం ఎందుకు రెచ్చగొట్టారు? దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళల్ని తీవ్రంగా అవమానించారు. కులం ఆధారంగా వారిని శూద్రులు అన్నారు. వారిపై విధ్వేష వ్యాఖ్యలు చేశారు’’ అని అన్నారు.

Harish Rao : ఇంత డెవలప్‌మెంట్ దేశంలో ఎక్కడా చూడలేదు.. సీఎం కేసీఆర్‌పై క్రికెటర్ రాయుడు, హీరో నాని ప్రశంసల వర్షం

అయితే మౌర్య వ్యాఖ్యలను సమాజ్‭వాదీ పార్టీకి చెందిన మహిళా నేతలు రోలి తివారి మిశ్రా, రిచా సింగ్ తప్పు పట్టారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. గత కొంత కాలంగా మౌర్య వ్యాఖ్యలపై వీరిద్దరూ తరుచూ స్పందిస్తూనే ఉన్నారు. ఇది పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు నేతలు వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, అయితే ప్రయోజనం లేకపోయినట్లు సమాచారం. దీంతో వీరిని పార్టీ నుంచి తొలగింపుకే అఖిలేష్ మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రిచా సింగ్ గత ఎన్నికల్లో అలహాబాద్ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఇక తివారీ మిశ్రా సైతం ఆగ్రా నుంచి పోటీకి దిగి ఓడిపోయారు.