Uttar Pradesh: పోలీస్ స్టేషన్‭లో బీజేపీ నేత భర్తను చితక్కొట్టిన ఎస్పీ ఎమ్మెల్యే

కొంతమందిపై దాడి చేసినందున తాను నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని రాకేష్ ప్రతాప్ సింగ్ అన్నారు. నిరసన మధ్యే గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు దీపక్ సింగ్ చేరుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడిని, అతని మద్దతుదారులను దుర్భాషలాడడం బిగ్గరగా వినిపించింది

Uttar Pradesh: పోలీస్ స్టేషన్‭లో బీజేపీ నేత భర్తను చితక్కొట్టిన ఎస్పీ ఎమ్మెల్యే

Uttar Pradesh: భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకురాలి భర్తను సమాజ్‭వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చితక్కొట్టాడు. అది కూడా పోలీస్ స్టేషన్లో అందరి ముందే. ఈ ఘటనను వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆయన దాడి చేస్తుండగా పోలీసులు సహా మరికొంత మంది ఆపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినలేదు. తీవ్రంగా దాడి చేశారు. ఎట్టకేలకు కాసేపటికి ఇరువురినీ పోలీసులు విడదీశారు. అనంతరం బాధితుడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ జిల్లాలో ఉన్న గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో చెందిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాకేష్ ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వస్తూ అక్కడ నిరసనలో తనను అసభ్యంగా తిట్టాడని, దీంతో తాను సహనం కోల్పోయి దాడి చేయాల్సి వచ్చిందని తెలిపారు.

Karnataka Polls: పోలింగ్ మధ్యలో పొట్లాట.. మంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ

దీపక్ సింగ్ సహా అతని మద్దతుదారులు తన మద్దతుదారుల్లో కొంతమందిపై దాడి చేసినందున తాను నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని రాకేష్ ప్రతాప్ సింగ్ అన్నారు. నిరసన మధ్యే గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు దీపక్ సింగ్ చేరుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడిని, అతని మద్దతుదారులను దుర్భాషలాడడం బిగ్గరగా వినిపించింది. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ పరిస్థితి అకస్మాత్తుగా చేయి దాటిపోయిందని, చూస్తుండగానే ఇరు నేతలు దాడిలో చిక్కుకున్నారని అన్నారు. సమస్య ఇప్పుడు పరిష్కరించబడిందని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.