UP: మాయావతి నాయకత్వం కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమాజ్‭వాదీ పార్టీ ఎంపీ

ఎంపీ బార్క్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘‘సోదరాభావం కోసం మాయావతి చాలా కష్టపడ్డారు. మాయావతి అనే వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వం. దేశానికి ఆమె అవసరం చాలా ఉంది. ఓబీసీలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలంటే మాయావతి చాలా అవసరం. సమాజం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమె సుప్రెమో. ముస్లిం సమాజానికి చెందిన మేము కూడా ఆమెకు మద్దతిస్తాం’’ అని అన్నారు.

UP: మాయావతి నాయకత్వం కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమాజ్‭వాదీ పార్టీ ఎంపీ

SP senior leader Shafiqur Rahman Barq praises Mayawati

UP: బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతిని పొగుడుతూ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. సమాజం కోసం ఆమె ఎంతగానో కృషి చేశారని, ఆమె వెంట ముస్లిం సమాజం మొత్తం ఉంటుందంటూ బార్క్ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో బార్క్ తొందరలోనే పార్టీ మారబోతున్నారని, ఎస్పీకి ఇక టాటా చెప్పి బీఎస్పీలో చేరతారని అప్పుడే ఊహాగాణాలు ప్రారంభమయ్యాయి.

Madhya Pradesh: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్

ఎంపీ బార్క్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘‘సోదరాభావం కోసం మాయావతి చాలా కష్టపడ్డారు. మాయావతి అనే వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వం. దేశానికి ఆమె అవసరం చాలా ఉంది. ఓబీసీలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలంటే మాయావతి చాలా అవసరం. సమాజం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమె సుప్రెమో. ముస్లిం సమాజానికి చెందిన మేము కూడా ఆమెకు మద్దతిస్తాం’’ అని అన్నారు.

Karnataka: ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్.. నాలుగు దిక్కుల నుంచి రథయాత్రలు చేస్తారట

కాగా, బార్క్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి కొద్ది రోజుల కిందటే సొంత పార్టీపై బార్క్ విమర్శలు గుప్పించారు. ముస్లింల కోసం సమాజ్‌వాదీ పార్టీ పని చేయడం లేదని ఘాటుగానే స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఎనిమిది నెలల అనంతరం మాయావతిపై ప్రశంసలు కురిపించారు. ఇక పలుమార్లు ఎంపీగా గెలిచిన తనను కాదని కొత్తగా ఎన్నికైన ఎస్టీ హసన్‭ను పార్లమెంట్లో పార్టీ నాయకుడు చేయడం పట్ల బార్క్ అసంతృప్తిగా ఉన్నారట. దాని ప్రభావమే ఇదంతా అని కొందరు విమర్శకులు అంటున్నారు.

Assembly Election: ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీ బలమెంతంటే?

ఇక కొద్ది రోజుల క్రితమే ఎస్పీకి చెందిన ముస్లిం నేత ఇమ్రాన్ మసూద్ బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. అంతే కాకుండా ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్ సైతం అఖిలేష్ మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో ముస్లిం సమాజం పట్ల మాయావతి సానుకూలంగా స్పందిస్తుండడం ఈ పరిణామాలకు కారణమని అంటున్నారు. అజాం ఖాన్‭ను సైతం తమ పార్టీలోకి లాగేందుకు మాయావతి ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారట. వీరంతా నిజంగానే బీఎస్పీ వైపుకు వెళ్తే, యూపీలో మెజారిటీ ముస్లిం ఓట్లు మాయావతి ఖాతాలో పడ్డట్టే.