Tamil Nadu: తమిళనాడు గవర్నర్‭కు మళ్లీ షాకిచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్

బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదని స్టాలిన్ అన్నారు. తాము గవర్నర్ చర్యలను మాత్రమే విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు

Tamil Nadu: తమిళనాడు గవర్నర్‭కు మళ్లీ షాకిచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్

CM Stalin at TN Assembly

Tamil Nadu: కొద్ది రోజుల క్రితమే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన మీద స్టాలిన్ ప్రభుత్వం మరో తీర్మానం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తాజా తీర్మానంలో ప్రభుత్వం ఆరోపించింది.

Karnataka Polls: కర్ణాటకలో ముదిరిన పాల యుద్ధం.. అసెంబ్లీ ఎన్నికలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా?

దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ”గవర్నర్ నిర్లిప్త వ్యక్తిగా ఉండాలని సర్కారియా కమిషన్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో జోక్యం చేసుకోరాదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. గవర్నర్ మార్గదర్శిగా ఉండాలని సుప్రీంకోర్టు సైతం పలు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మన గవర్నర్ మాత్రం ప్రజలకు మిత్రుడిగా ఉండడానికి సిద్ధంగా లేరు” అని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో అన్నారు.

Mayawati: నేరస్తులకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన బీఎస్పీ చీఫ్ మాయావతి

బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదని స్టాలిన్ అన్నారు. తాము గవర్నర్ చర్యలను మాత్రమే విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట కాలపరిమితి లోపు ఆమోదం తెలిపేలా తమిళనాడు గవర్నర్‌ను ఆదేశించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది.