JDS: ఎన్ని లోన్లైనా తీసుకోండి, మేం అధికారంలోకి రాగానే అన్నీ మాఫీ చేస్తాం.. ఓటర్లకు జేడీఎస్ హామీ

వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రమనగర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిత కుమారస్వామి.. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కోసం తన సీటును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. రామనగర నియోజకవర్గ ప్రజలు అతనికి తమ ప్రేమను, మద్దతును ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు

JDS: ఎన్ని లోన్లైనా తీసుకోండి, మేం అధికారంలోకి రాగానే అన్నీ మాఫీ చేస్తాం.. ఓటర్లకు జేడీఎస్ హామీ

Take loans and don't repay, will waive off once in power says JDS

JDS: ‘‘ఎన్ని లోన్లైనా తీసుకోండి.. మేం అధికారంలోకి రాగానే అవన్నింటినీ మాఫీ చేస్తాం’’ కర్ణాటక ప్రజలకు జనతా దళ్ సెక్యూలర్ పార్టీ తాజాగా చేసిన హామీ ఇది. స్త్రీ శక్తి పథకం కింది ఎన్ని లోన్లైనా తీసుకోండి కానీ, వాటిని తిరిగి చెల్లింద వద్దని ఓటర్లను కోరింది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. తన భర్త ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లో అన్ని లోన్లను మాఫీ చేస్తారని ఓటర్లకు ఆమె హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్.. రాహుల్‭తో కలిసి ఎర్రకోటవైపు అడుగులు

వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రమనగర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిత కుమారస్వామి.. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కోసం తన సీటును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. రామనగర నియోజకవర్గ ప్రజలు అతనికి తమ ప్రేమను, మద్దతును ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిఖిల్ రాజకీయ ప్రవేశంపై కుమారస్వామి ఇంతకు ముందే ప్రకటన చేశారు. “నిఖిల్‌ను మీ(ఓటర్ల) ఒడిలో ఉంచుతున్నాను. మీరు ఇప్పుడు అతనికి మీరే తల్లిదండ్రులు. కొడుకుగా మీ నమ్మకాన్ని పొందడం అతడి కష్టంపై ఆధార పడి ఉంది. కానీ కుట్ర రాజకీయాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ బలి కాకూడదు. మీరు అతనిని శక్తివంతం చేయండి, మీకు కూడా మరింత శక్తి వస్తుంది” అని అన్నారు.

Congress Bus Yatra: బస్సు రెడీ అయింది, మరి ప్రయాణికులేరి!.. అయోమయంలో కాంగ్రెస్ బస్సు యాత్ర

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జేడీఎస్ ఇప్పటికే 93 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అంతే కాకుండా పంచరత్న పేరుతో యాత్ర చేపట్టి ముమ్మర ప్రచారం చేస్తోంది. ఇక ఆ పార్టీ కీలక నేత హెచ్‌డీ కుమారస్వామి చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పార్టీ ప్రకటించింది.