కాక రేపుతున్న కాకినాడ : ఎంపీ సీటుపై ఉత్కంఠ  

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 09:56 AM IST
కాక రేపుతున్న కాకినాడ : ఎంపీ సీటుపై ఉత్కంఠ  

తూర్పు గోదావరి :  కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకినాడ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై…ప్రధాన పార్టీలు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఆశావహ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, అర్బన్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగే…5సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తోట నర్సింహం.. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజుపై విజయం సాధించారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.. మూడు సార్లు గెలుపొందారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1998 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కృష్ణంరాజు విజయం సాధించి…కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 

 

వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత ఎంపీ తోట నర్సింహం….ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు అసెంబ్లీకి వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దీంతో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే పీఆర్పీ, వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయిన చలమలశెట్టి సునీల్‌కు…టీడీపీ ఆహ్వానం పంపింది. సునీల్ పార్టీలో చేరితే కాకినాడ ఎంపీ సీటు కేటాయిస్తామని చెబుతోంది. టీడీపీ ఆహ్వానాన్ని మన్నించి పోటీ చేస్తే….మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థిగా సునీల్ ఘనత దక్కించుకోనున్నారు. 

 

చలమలశెట్టి సునీల్….జనసేనలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషించాల్సి ఉంటుంది. అయితే టీడీపీ, వైసీపీ, జనసేనలు…కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే ఎంపీ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే జనసేన నుంచి సీటు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ప్రశ్న తలెత్తుతోంది. సునీల్ వైసీపీకి దూరంగా ఉండటంతో….వైసీపీ సైతం కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. మూడు ప్రధాన పార్టీలో కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు…ఆశావహులు ఎవరు ముందుకు రావడం లేదు. ఆయా పార్టీల్లో సీనియర్లు ఉన్నప్పటికీ….పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. చలమలశెట్టి సునీల్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా…మిగిలిన రెండు పార్టీలు కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. అసెంబ్లీ సీట్ల సర్దుబాటు పూర్తయితే….అవకాశం రానికి ఎంపీ సీటు కేటాయించే అవకాశం ఉంది. అప్పటి వరకు కాకినాడ ఎంపీ సీటు స్పష్టత వచ్చే ఛాన్సే లేదు.