పద్మశ్రీ తీసుకోవటం కాదు పద్మశ్రీలా ఉండాలి : మోహన్ బాబుపై పంచ్‌లు

  • Published By: chvmurthy ,Published On : March 23, 2019 / 08:34 AM IST
పద్మశ్రీ తీసుకోవటం కాదు పద్మశ్రీలా ఉండాలి : మోహన్ బాబుపై పంచ్‌లు

అమరావతి: పంచాయతీ పన్నులు కట్టకుండా, టీచర్లకు, లెక్చరర్లకు సరైన జీతాలు ఇవ్వని మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న శ్రీ విద్యానికేతన్ యజమాని పద్మశ్రీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అని ప్రజలు అనుకుంటున్నారని, చివరికి మంచు కరిగి రాయి మిగిలిందని అన్నారు.
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ డాక్టరేట్లు, పద్మశ్రీలు తీసుకుని ఉచిత విద్య పేరుతో విద్యార్ధులను మోసం చేస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. ఉచిత విద్య పేరుతో ప్రభుత్వం నుంచి ఓవైపు లబ్ది పొందుతూ.. మరో వైపు విద్యార్ధుల నుంచి ఫీజులు తీసుకున్నారా లేదా అని కుటుంబరావు.. మోహన్ బాబును ప్రశ్నించారు. కాలేజీ బయట రోడ్డు మీద ఉన్న కూల్ డ్రింక్ షాపుల నుంచి, హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి, కిరాణా షాపుల నుంచి కూడా మా వల్లే మీకు వ్యాపారాలు జరుగుతున్నాయని బెదిరించి గుడ్ విల్ వసూలు చేశారని కుటుంబరావు ఆరోపించారు. మోహన్ బాబుకు సపోర్టుగా ఏ కాలేజీ వారు మద్దతు తెలుపలేదని, NAC సర్టిఫికెట్ కోసం మోహన్ బాబు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. 

వైసీపీకి మద్దతిస్తూ జగన్ కోసం చంద్రబాబుపై బురద చల్లటానికే మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని కుటుంబరావు అన్నారు. అవాస్తవాలు, అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయవద్దన్నారు. మీరు అమరావతి వచ్చి, మీ బాకీ ఎంత ఉందనేది ఫైనల్ గా చెప్తే మిగిలిన కాలేజీలతో పాటు మీ బాకీ పైసలతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని కుటుంబరావు చెప్పారు.
Read Also : నన్ను కొట్టడానికి 100మంది వచ్చి.. చప్పట్లు కొట్టి వెళ్లారు