MS Raju : సైకో, ఉన్మాది, యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆ ఎమ్మెల్యేని వేధిస్తున్నాడు- ఎంఎస్ రాజు

MS Raju : బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సైకో, ఉన్మాది అని సొంత కుటుంబసభ్యులే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ ఎమ్మెల్యేని మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు.

MS Raju : సైకో, ఉన్మాది, యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆ ఎమ్మెల్యేని వేధిస్తున్నాడు- ఎంఎస్ రాజు

MS Raju(Photo : Google)

MS Raju : శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక సైకో, ఒక ఉన్మాది అని విరుచుకుపడ్డారు. హత్యలు చేసి జైలుకెళ్లి వచ్చిన ఒక హంతకుడిని యూట్యూబ్ లో కూర్చోబెట్టి స్టార్ ను చేసి జనాల మీదకు వదిలితే రక్తం తాగక మరేం చేస్తాడని ఎంఎస్ రాజు మండిపడ్డారు. శాప్ ఛైర్మన్ పదవిని తాలిబన్ల చేతిలో పెట్టారని ఆయన విమర్శించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒక సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్ అన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ ని.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సైకో, ఉన్మాది అని సొంత కుటుంబసభ్యులే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు.

” ప్రజలెన్నుకున్న వ్యక్తిపై నేరస్తుడి పెత్తనమేంటి? నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ని బైరెడ్డి అప్రతిష్టపాలు చేయడం దుర్మార్గం. నందికొట్కూరులో దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యేని బలహీన పరచడం అధిపత్య పోరులో భాగమే. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాడు. మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఎమ్మెల్యే ఆర్థర్ ను పర్యటనలకు పోకుండా అడ్డుకుంటున్నాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేని అప్రదిష్ట పాలు చేస్తున్నాడు. దళిత ఎమ్మెల్యేను పబ్లిక్ లో అగౌరపరుస్తూ, అధికారుల దగ్గర హేళన చేస్తున్నాడు. మున్సిపల్, ఎమ్మార్వో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులు ముఠాగా ఏర్పడి దందాలు చేస్తున్నారు.

మున్సిపల్ ఛైర్మన్.. జగనన్న ఇంటి పట్టాల పేరుతో అవినీతికి పాల్పడ్డాడు. అక్రమాలకు పాల్పడుతున్న యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని శాప్ ఛైర్మన్ గా చేశారు. యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి చెందిన ముఠా నాయకుల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. అనేక అక్రమాలకు పాల్పడుతున్న యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ని శాప్ ఛైర్మన్ గా చేశారు. తాలిబన్ల చేతిలో క్రీడా రంగాన్ని పెట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్ శాప్ ని ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది. ఓ యువనేత అకృత్యాలకు శాప్ అడ్డాగా మారిందని ప్రతి ఒక్కరు అంటున్నారు” అని ఎంఎస్ రాజు ఆరోపించారు.

Also Read..Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై కావాలనే తప్పుడు ప్రచారం : సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ