గెలిచేదెవరో : కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 12:50 AM IST
గెలిచేదెవరో : కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

కరీంనగర్‌ మేయర్‌ పీఠంపై అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు 8 కార్పొరేషన్లలో ప్రజలు జైకొట్టారని.. కరీంనగర్‌ ప్రజలపైనా తమకు నమ్మకముందని చెబుతున్నారు.

అయితే ఈసారి కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం  ఏడు గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. అధికారులు సర్వం సిద్ధం చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. 

* కరీంనగర్‌లోని ఏఎస్‌ఆర్‌ కళాశాలలోని ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
* మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌ బోట్లను లెక్కించనున్నారు. 
* మూడు నుంచి నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. 

* కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
* అభ్యర్థులు, ఏజెంట్లు సెల్‌ఫోన్లను కౌంటింగ్‌ కేంద్రంలోకి తీసుకురావద్దని అధికారులు సూచించారు.
* కరీంనగర్‌ నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 

* 20,37వ డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు డివిజన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 
* దీంతో 58 డివిజన్లకు ఈనెల 24న పోలింగ్‌ జరిగింది.
* 58 డివిజన్లలో 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

* నగరంలో మొత్తంగా 2 లక్షల 64వేల 134 మంది ఓటర్లు ఉండగా… వీరిలో లక్షా 65 వేల 147 ఓట్లు పోలయ్యాయి. 
* 58 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను, ఇద్దరు చొప్పున అసిస్టెంట్లను, 20 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

మరి కరీంనగర్‌ ఓటర్లు ఎవరిపక్షం నిలబడ్డారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక ఈనెల 29న మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు కో- ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను నిర్వహించనున్నారు.

Read More : ఉంటుందా ? ఊడుతుందా ? : తేలనున్న ఏపీ మండలి భవితవ్యం