ఊహించని ట్విస్ట్, జన్‌ధన్ ఖాతాల్లోని సొమ్ము వెనక్కి… కారణం ఇదే.

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధి, ఆదాయం లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండ

ఊహించని ట్విస్ట్, జన్‌ధన్ ఖాతాల్లోని సొమ్ము వెనక్కి… కారణం ఇదే.

Telangana Grameena Bank Tak

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధి, ఆదాయం లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి కూడా లేదు. వారి ఇబ్బందులను దృష్టి పెట్టుకుని కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సాయం ప్రకటించింది. అందులో భాగంగా జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారికి నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు డబ్బులు జమ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారంగా తొలి విడత నగదు సొమ్మును ఏప్రిల్ మొదటి వారంలో జమ చేసింది.

కొంతమంది మాత్రమే అర్హులు:
అయితే, ఇందులో ఓ పొరపాటు జరిగిపోయింది. వెంటనే గ్రహించిన బ్యాంకు జన్ ధన్ ఖాతాల్లోని డబ్బుని వెనక్కి తీసుకుంది. చాలా మంది జన్‌ధన్ ఖాతాలు కలిగివున్నప్పటికీ వారిలో చాలా మంది పీఎంజీకేవై (ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన) పథకం కింద ఈ సొమ్ము పొందేందుకు అర్హులు కాదని తేలింది. దీంతో ఆ సొమ్మును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. ఇలా మొత్తం రూ.16 కోట్లను వెనక్కి తీసుకుంది.

9 లక్షల ఖాతాల్లో డబ్బు జమ:
కేంద్రం నిర్ణయం మేరకు.. పీఎంజీకేవై పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 473 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లో ఖాతాలు కలిగున్న సుమారు 9 లక్షల మందికి డబ్బులు జమయ్యాయి. వీరిలో 5,15,260 మంది మాత్రమే అర్హులని, మిగతా వారు అనర్హులని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో అనర్హులకు ఖాతాల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంది.

2014 ఆగస్టు 1 తర్వాత ఖాతాలు తెరిచిన వాళ్లే అర్హులు:
తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలో పీఎంజీకేవై నిధులను (ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన) ఉపసంహరించుకున్నారు. దాదాపు 3 లక్షల జన్ ధన్ ఖాతాల నుంచి నగదును బ్యాంకు వెనక్కి తీసుకుంది. 2014 ఆగస్టు 1 తర్వాత ఖాతాలు తెరిచిన వాళ్లే పీఎంజీకేవైకు అర్హులని తెలిపారు. అంతకుముందు తెరిచిన ఖాతాల్లో పడిన మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తున్నామని బ్యాంకు ఉన్నతాధికారి తెలిపారు. అయితే, చాలా మంది డబ్బు పడిన వెంటనే డబ్బును విత్ డ్రా చేశారనీ, అలాంటి వారిని గుర్తించి, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ బ్యాంక్ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు. తాము పొరపాటున నగదును జమ చేశామని, వారం తర్వాత దాన్ని గుర్తించామని వివరించారు.

రూ.500 తిరిగి వసూలు చేయాలన్న దానిపై దృష్టి:
లాక్ డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.500 చొప్పున ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు మొదటి నెలలో రూ.500 జన్ ధన్ ఖాతాల్లో జమ అయింది. ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న జన్ ధన్ ఖాతాల్లో రూ.500ను పడ్డాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని బ్రాంచీల్లో దాదాపు 9 లక్షల ఖాతాల్లో డబ్బు జమైనట్లుగా తెలుస్తోంది. అయితే 5 లక్షల పైచిలుకు ఖాతాలు మాత్రమే అర్హులు, మిగిలిన బ్యాంకు ఖాతాల వారు అనర్హులని యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఖాతాల్లో పడిన సొమ్మును ఉపసంహరించినట్లుగా బ్యాంకు జనరల్ మేనేజర్ మహేశ్ వెల్లడించారు. కాగా, జమ అయిన సొమ్మును డ్రా చేసిన ఖాతాలు దాదాపు లక్ష వరకూ ఉన్నాయని, ఆ ఖాతాదారుల నుంచి మళ్లీ రూ.500 ఎలా వసూలు చేయాలన్న దానిపై దృష్టి పెట్టామన్నారు.