తెలంగాణ మున్సి పోల్..రీ పోలింగ్ ఎక్కడంటే

  • Published By: madhu ,Published On : January 23, 2020 / 02:10 PM IST
తెలంగాణ మున్సి పోల్..రీ పోలింగ్ ఎక్కడంటే

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టెండర్ ఓట్లు దాఖలయితే..రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తామని SEC గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు 2020, జనవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ జరిగింది. 120 మున్సిపాలిటీల్లోని 2 వేల 647 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 

కానీ బోధన్ 32వ వార్డులోని 87, మహబూబ్ నగర్ మున్సిపల్ లోని 41 వార్డులోని 198, కామారెడ్డి 41 వార్డులోని 101 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో టెండర్ ఓట్లు దాఖలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు ఇది వరకే ప్రకటించినట్లుగా 2020, జనవరి 25వ తేదీన చేపడుతారు. 
 

అభ్యర్థుల వివరాలు :-  
* మొత్తం అభ్యర్థులు- 12,898 
* టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో 2,972 మంది అభ్యర్థులు
* కాంగ్రెస్‌ నుంచి పోటీలో 2,616  మంది అభ్యర్థులు
* బీజేపీ నుంచి బరిలో 2,313 మంది అభ్యర్థులు

* టీడీపీ నుంచి 347మంది అభ్యర్థులు
* ఎంఐఎం 276 స్థానాల్లో పోటీ
* సీపీఐ నుంచి 177 మంది అభ్యర్థులు

* సీపీఎం నుంచి 166 మంది అభ్యర్థులు
* పలు గుర్తింపు పొందిన పార్టీల నుంచి 281 మంది పోటీ
* స్వతంత్ర అభ్యర్థులు 3,750 మంది

80 వార్డులు ఏకగ్రీవం : –
* 120 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు- 2,727 
* 80 వార్డులు ఏకగ్రీవం
* 120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు పోలింగ్‌

* 9 కార్పొరేషన్లలో మొత్తం డివిజన్లు-325
* ఒక డివిజన్‌ ఏకగ్రీవం
* 324 డివిజన్‌లలో పోలింగ్

Read More : సంగారెడ్డిలో మరో దిశ ఘటన : దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్