కరోనా కలకలం : చైనాలో తెలంగాణ విద్యార్థులు..భయాందోళనలో పేరెంట్స్

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 02:19 AM IST
కరోనా కలకలం : చైనాలో తెలంగాణ విద్యార్థులు..భయాందోళనలో పేరెంట్స్

కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్‌తో పలువురు మృత్యువాత పడుతున్నారు. చైనాలో వైద్య విద్యను చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఇండియాకు పంపియ్యాలని కోరుతున్నా..అక్కడి దేశం అంగీకరించడం లేదు. కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చాకే..వెళ్లాలని ఆ దేశం ఆంక్షలు విధించింది.

దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధైర్యం చెబుతున్నారు. చైనాలో వేలాది మంది తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు MBBS చదువుతున్నట్లు, అందులో కొందరు ఆ దేశంలోని వుహాన్ నగరంలో ఉన్నట్లు భావిస్తున్నారు. వీరంతా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అక్కడకు వెళ్లినట్లు గుర్తించారు.  కేంద్ర బృందం..రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సహా ఇతర అధికారులతో సమావేశమైంది.

ఈ సందర్భంగా కేంద్ర బృందం కొన్ని సూచనలు చేసినట్లు తెలిపింది. స్వైన్ ఫ్లూ కంటే పెద్దది కాదని ప్రజారోగ్య అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. 

* వుహాన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్టు వివరాలను బీజింగ్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులకు అందజేయాల్సిందిగా కేంద్రం కోరింది.
* కేంద్రం ఆదేశాలు జారీ చేస్తే వుహాన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది.
* ఎయిరిండియా జెంబో విమానాన్ని అందుకు సిద్ధంగా ఉంచామని… ప్రభుత్వం ఆదేశాలు రావడమే ఆలస్యమని తెలిపింది.

ఇదిలా ఉంటే…కేంద్ర బృందం గాంధీ ఆస్పత్రిని సందర్శించనుంది. 2020, జనవరి 29వ తేదీ బుధవారం ఆస్పత్రిని సందర్శించి..ఏర్పాట్లను పరిశీలించనుంది. కరోనా వైరస్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, వదంతులు నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. 

* చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
* ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే నమోదైన మరణాలు తాజాగా రాజధాని బీజింగ్‌కూ పాకాయి.
 

* మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
* మొన్న ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపింది.
* ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4 వేల దాటిపోయినట్లు చెప్పింది.

Read More : సిరీసే లక్ష్యం : టీ 20..ఇండియాను కివీస్ ఆపగలదా