మాచర్ల టికెట్ రగడ : సీఎం వెళ్లగానే మాజీ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న చలమారెడ్డి

మాచర్ల టికెట్ రగడ : సీఎం వెళ్లగానే మాజీ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న చలమారెడ్డి

అమరావతి: ఏపీ టీడీపీలో టికెట్ల వివాదం తారస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, వారి అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబు ఇంటి ముందే

మాచర్ల టికెట్ రగడ : సీఎం వెళ్లగానే మాజీ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న చలమారెడ్డి

అమరావతి: ఏపీ టీడీపీలో టికెట్ల వివాదం తారస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, వారి అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబు ఇంటి ముందే

అమరావతి: ఏపీ టీడీపీలో టికెట్ల వివాదం తారస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, వారి అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబు ఇంటి ముందే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల టికెట్ వివాదం టీడీపీలో చిచ్చు రాజేసింది. మాచర్ల అసెంబ్లీ టికెట్ ను చంద్రబాబు.. అంజిరెడ్డికి ఇచ్చారు. దీన్ని చలమారెడ్డి అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. చలమారెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం(మార్చి 19) రాత్రి నుంచి చలమారెడ్డి అనుచరులు, మద్దతుదారులు.. సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. బుధవారం(మార్చి 20) మధ్యాహ్నం బారికేడ్లు దాటుకుని సీఎం ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో సీఎం ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
Read Also : మాచర్ల టికెట్ రగడ : సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత

మాచర్ల నియోజకవర్గానికి చెందిన 500మంది కార్యకర్తలు మంగళవారం రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి చలమారెడ్డికి కాకుండా.. పార్టీ సభ్యత్వం కూడా లేని అంజిరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపైనా చలమారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. రాయపాటి సాంబశివరావు తనకు టికెట్ రాకుండా చేశారని, ఆయన ఏ విధంగా గెలుస్తారో చూస్తానని చలమారెడ్డి హెచ్చరించారు.

మాచర్ల సీటు విషయంపై చంద్రబాబు దగ్గర పంచాయతీ జరిగింది. ఎంపీ రాయపాటి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, చలమారెడ్డి హాజరయ్యారు. భవిష్యత్తులో తగు ప్రాధాన్యం ఇస్తామని చలమారెడ్డికి.. చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఉన్న సమయంలో సైలెంట్ గానే ఉన్న చలమారెడ్డి.. చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోగానే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై చేయి చేసుకున్నారని సమాచారం. టికెట్ దక్కించుకున్న అంజిరెడ్డి.. లక్ష్మారెడ్డికి బంధువు అవుతారు. తన బంధువు కావడంతో అంజిరెడ్డికి మాచర్ల టికెట్ దక్కేలా లక్ష్మారెడ్డి చేశారని, దీంతో ఆయనపై చలమారెడ్డి చెయ్యి చేసుకున్నారని తెలుస్తోంది.
Read Also : ఇథియోపియాలో కారు ప్రమాదం : హైదరాబాద్ వాసి దుర్మరణం

×