రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి : టీజీ వెంకటేష్

రాయలసీమలో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని.. లేదంటే పాత డిమాండ్లు తెరపైకి వస్తాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2020 / 02:37 PM IST
రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి : టీజీ వెంకటేష్

రాయలసీమలో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని.. లేదంటే పాత డిమాండ్లు తెరపైకి వస్తాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రాయలసీమలో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని.. లేదంటే పాత డిమాండ్లు తెరపైకి వస్తాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం (జనవరి 5, 2020) కర్నూలులో ఆయన 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాలు రాయలసీమలోనే నిర్వహించాలన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలకు చట్టబద్ధత లేదని..అందుకే ప్రజలు వాటి సూచనలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మూడు ప్రాంతాలకు న్యాయం చేసే విధానంలో కమిటీలు పోలేదన్నారు. నాయకుడు ఎలా చెప్పారో…వారు కూడా అలాగే అనుసరించారని ఆరోపించారు. ఇవి జ్యుడీషియల్ కమిటీలు కాదన్నారు. న్యాయంగా చెప్తారని నమ్మడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలు కాదని చెప్పారు. 

ప్రజలకు కావల్సింది వెంటనే సెటిల్ అయ్యే ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని ప్రజల టెంపో తగ్గించాలంటే అమరావతిలో కూడా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని…అప్పుడు అన్ని విభాగాలు అక్కడ కూడా ఉన్నట్లవుతుందందన్నారు. రాజధాని రైతు సమస్యలను పరిష్కరించాలన్నారు. మూడు ప్రాంతాల్లో సచివాలయాలు నిర్మించాలన్నారు.