TG Venkatesh : పవన్ కల్యాణ్ చంద్రబాబుకి దగ్గరవడానికి కారణం సీఎం జగన్- టీజీ వెంకటేశ్

TG Venkatesh : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వం భయపడి ఎలక్షన్స్ కు వెళ్లారు అని అనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

TG Venkatesh – Alliance : ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. పొత్తుల అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేది సస్పెన్స్ గా మారింది. దీనిపై రాజకీయ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పొత్తుల అంశంపై మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ హాట్ కామెంట్స్ చేశారు.

పొత్తులపై బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదని ఆయన అన్నారు. బీజేపీ.. జనసేన వెంట పడుతోంది అనేది ఏమీ లేదన్నారాయన. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు, జనసేన టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ అధిష్టానం పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని టీజీ వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ జనసేనతోనే ఉందని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుపై అధిష్టానం చూసుకుంటుందని తేల్చి చెప్పారాయన.

Also Read..Chandrababu : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైర్లు

ఇదంతా మాయ ప్రపంచం అన్న టీజీ.. మాయ ప్రపంచంలో జగన్ మాయ వలన పవన్ కల్యాణ్ చంద్రబాబుకి దగ్గరయ్యారు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వం భయపడి ఎలక్షన్స్ కు వెళ్లారు అని అనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read..TDP Leader Hariprasad : కొడాలి నానీ..కాపుల గురించి నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తాం

ట్రెండింగ్ వార్తలు