Ktr slams NDA government: మిషన్ భగీరథకు జాతీయ అవార్డు.. కేంద్రంపై వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్

తెలంగాణలో అమలు అవుతున్న మిషన్‌ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్‌ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. తెలంగాణ వచ్చిన అవార్డులు అందుకోవడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు.

Ktr slams NDA government: మిషన్ భగీరథకు జాతీయ అవార్డు.. కేంద్రంపై వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్

Ktr slams NDA government: తెలంగాణలో అమలు అవుతున్న మిషన్‌ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్‌ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. తెలంగాణ వచ్చిన అవార్డులు అందుకోవడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు.

దేశంలోనే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు నల్లాల ద్వారా శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించినందుకు రాష్ట్ర మంత్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. తాజాగా, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ… తెలంగాణకు అవార్డు రావడం పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూనే సెటైర్ వేశారు. ‘‘ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రానికి థ్యాంక్స్.. కానీ, మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుంది’’ అని అన్నారు.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw