25 ఏళ్లు జగన్ పాలన ఉంటుంది

ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 02:18 PM IST
25 ఏళ్లు జగన్ పాలన ఉంటుంది

ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు.

ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు. ప్రధాని మోడీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధాని కాకముందే మోడీతో పరిచయం ఉందన్నారు. 

బీజేపీతో వైసీపీ ఎంపీలు ఎవరూ టచ్ లో లేరని చెప్పారు. సుజనా చౌదరినే తమ పార్టీలోకి వచ్చేఅవకాశం ఉందన్నారు. బీజేపీకి టచ్ లో ఉన్న వైసీపీ నేతలెవరో సుజనా చౌదరి చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఎవరూ పార్టీ లైన్ దాటే ప్రసక్తే లేదని చెప్పారు. 25 ఏళ్లు జగన్ పాలన ఉంటుందని తెలిపారు. 

శుక్రవారం(నవంబర్ 22, 2019) అమరావతిలో సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. తన నియోజవర్గం సమస్యలపై సీఎం జగన్ తో చర్చించామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు. ప్రధాని కనపడితే నమస్కారం చేయడం సహజమన్నారు. బీజేపీతో వైసీపీ ఎంపీలు ఎవరూ టచ్ లో లేరని చెప్పారు. సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. 

కొద్ది రోజుల క్రితం ఇంగ్లీష్ మీడియంకు సంబంధంచి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జగన్ కు ఆయన వివరణ ఇచ్చారు.