ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు  : పవన్ కళ్యాణ్ 

జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 10:36 AM IST
ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు  : పవన్ కళ్యాణ్ 

జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రకాశం : జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులకు నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కొత్త యువ రైతులను తయారు చేయాలనే బలమైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. భూములిచ్చి లక్షమంది యువ రైతులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. తన లాగా పదో తరగతి చదివితే చాలన్నారు. యాక్టర్ కంటే ముందు తాను రైతునన్నారు. లాండ్ ఆండ్ ఆర్డర్ కోసం 25 వేల పోలీసు పోస్టులను భర్తీ చేస్తానని చెప్పారు. 
Read Also : బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్

అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఎవడబ్బ సొమ్మని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు పెన్షన్ వస్తుందని…అందరికీ అన్నం పెట్టే రైతుకు పెన్షన్ రాదని వాపోయారు. ఆడ పిల్లలకు ఎల్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తానని చెప్పారు. 

ఏపీలో ఆదాయంతో నిమిత్తం లేకుండా వైట్ కార్డు, పింక్ కార్డుతో నిమిత్తం లేకుండా, డబ్చు ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబానికి ఉచితంగా పది గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయిస్తానని తెలిపారు. తక్కువ మంది కుటుంబ సభ్యులుంటే ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడిస్తున్న రేషన్ బియ్యం తినడానికి పనికి రావన్నారు. తాను ఒక మాట ఇస్తే.. అదే మీద నిలబడుతానని స్పష్టం చేశారు. 

తాము సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నామని..వైసీపీ లాగా బీజేపీని భుజాల మీదికి ఎక్కించుకోలేదన్నారు. ప్రత్యేకహోదా కోసం నిలబడతారని పల్లకీలు మోసామని..రోజూ మీకు పల్లకీలు మేయడానికి కాదన్నారు. తాము సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మెడలు వంచి ఉద్దానంలో కిడ్నీ సమస్యపై పని చేయిస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు.
Read Also : జగన్ కూడా రెడీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపిద్దాం : కేటీఆర్