తిరుపతిని రాజధాని చేయాలి : మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి 

రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 10:14 AM IST
తిరుపతిని రాజధాని చేయాలి : మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి 

రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.

రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి…కానీ పాలనా వికేంద్రీకరణ కాదన్నారు. పాలన చేతకాక కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

పాలన వికేందరద్రీకరణ అంటే ముగ్గురు సీఎంలను పెట్టండన్నారు. రాజధానిని మారుస్తామని జగన్ ఇదివరకు ఎక్కడా చెప్పలేదన్నారు. అన్ని సౌకర్యాలున్న తిరుపతిని రాజధాని చేయండని అమర్ నాథ్ రెడ్డి కోరారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మరోవైపు రాజధాని తరలింపు ప్రతిపాదనపై రాజధాని గ్రామాలు భగ్గుమంటున్నాయి. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని గ్రామాలు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వెలగపూడిలో 17వ రోజు కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతికి భూములిచ్చిన రైతులను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారని రాజధాని వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.