Lok Sabha Elections 2024: కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయం.. బీఆర్ఎస్, ఆప్ తో చర్చలు

ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సమానదూరం పాటించాలని టీఎంసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే, ఆ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయం.. బీఆర్ఎస్, ఆప్ తో చర్చలు

Mamata banerjee on opposition unity

Lok Sabha Elections 2024: ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సమానదూరం పాటించాలని టీఎంసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే, ఆ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అనుకున్నదాని కంటే తక్కువ రాణించింది. అంతేగాక, పశ్చిమ బెంగాల్లోని సాగర్దిగి నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బైరాన్ బిశ్వాస్ గెలుపొందారు. ఆ నియోజక వర్గంలో ఎన్నో ఏళ్లుగా బలంగా ఉన్న టీఎంసీని కాంగ్రెస్ ఓడించి అందరినీ ఆశ్చర్యపర్చింది. దీంతో అదే రోజు, దేశంలో 2024 ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీచేస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

తాజాగా, లోక్ సభలోని టీఎంసీ పార్లమెంటరీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ కి సమాన దూరాన్ని పాటిస్తూ ప్రతిపక్ష పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలు పార్టీలతో మాట్లాడామని తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాక ఆయా పార్టీల విషయంలో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.

లోక్ సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఈ ఏడాది చివరిలోపు ఆయా పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చే వచ్చే అవకాశం ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా బీజేపీపై కాంగ్రెస్ సరైన రీతిలో పోరాడలేకపోతుందని చెప్పారు. కాగా, ఇటీవల బెంగాల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అనైతిక విజయం సాధించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. తమను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో సీపీఎం, బీజేపీతో కలిసిందని అన్నారు. కాంగ్రెస్ గెలుపుకోసం ఏర్పడిన అనైతిక కూటమిని ఖండిస్తున్నానని తెలిపారు.

Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు.. ఐదున్నర కోట్ల విలువైన నగలు, కోటికిపైగా నగదు స్వాధీనం