కారు జోరు : పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. మొదటి విడత పంచాయతీ సమరంలో టీఆర్ఎస్ హవా కొనసాగింది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 11:52 AM IST
కారు జోరు : పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. మొదటి విడత పంచాయతీ సమరంలో టీఆర్ఎస్ హవా కొనసాగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. మొదటి విడత పంచాయతీ సమరంలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. 900 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. 150కి పైగా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 2019, జనవరి 21 సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటవరకు సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ జరిగింది.

 

* పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు
* 900 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపు
* 150కిపైగా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపు
* రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 701 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
* 28వేల 976 వార్డు మెంబర్లకు ఎన్నికలు
* 3,701 సర్పంచ్ స్థానాలకు 12వేల 202 మంది అభ్యర్థుల పోటీ
* 28వేల 976 వార్డులకు 70వేల 094 మంది పోటీ
* మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించి కౌంటింగ్
* తర్వాత సర్పంచ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు
* సాయంత్రం 6గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు
* మొదటి విడతలో 769 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
* అత్యధిక స్థానాల్లో ముందంజలో టీఆర్ఎస్