టీఎస్ బడ్జెట్ రూ. 1, 82, 914.42 కోట్లు : కేటాయింపుల వివరాలు

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 06:48 AM IST
టీఎస్ బడ్జెట్ రూ. 1, 82, 914.42 కోట్లు : కేటాయింపుల వివరాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-21) మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ. 1, 82, 914.42 కోట్లుగా వెల్లడించారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు. ప్రధానమైన వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించింది. అందులో ప్రధానమైన రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లు, రైతు బీమా కోసం రూ. 1, 141 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

వివిధ రంగాలకు కేటాయింపులు : –

* రెవెన్యూ వ్యయం : 1, 38, 669.82 కోట్లు. 
* రెవెన్యూ మిగులు : 4,482.12 కోట్లు. 
* ఆర్థిక లోట్లు రూ. 33, 191.25

* గత సంవత్సరం రెవెన్యూ వృద్ధి రేటు 16 నుంచి 6 శాతానికి తగ్గింది. 
* గత సంవత్సరం బడ్జెట్‌లో లక్షా 36 వేలు ఖర్చు.
* రైతు బంధు పథకానికి రూ. 14 వేల కోట్లు. 

* మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 600 కోట్లు. 
* రైతు మద్దతు ధర కోసం రూ. 1000 కోట్లు. 
* రైతు వేదికల నిర్మాణం కోసం : రూ. 350 కోట్లు.
 

* సాగునీటి పారుదల రంగానికి : రూ. 11, 054 కోట్లు. 
* ఎంబీసీ కోసం : రూ. 500 కోట్లు. 
* అన్ని రకాల పెన్షన్ల కోసం : రూ. 11, 758 కోట్లు. 

* మత్సకారుల కోసం రూ. 1586 కోట్లు. 
* కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కోసం : రూ. 350 కోట్లు. 
* ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ : రూ. 16 వేల 534 కోట్లు. 
* ఎస్టీ డెవలప్ మెంట్ ఫండ్ కోసం : రూ. 95 వేల 771 కోట్లు. 

* మైనార్టీ అభివృద్ధికి రూ. 1,518 కోట్లు. 
* షెడ్యూల్ కులాల కోసం : రూ. 4, 356 కోట్లు. 
* మహిళలకు వడ్డీలేని రుణాలు : రూ. 1200 కోట్లు. 

* పంచాయతీ రాజ్ అభివృద్ధి కోసం రూ. 23, 500 కోట్లు. 
* మున్సిపల్ శాఖకు : రూ. 14, 809 కోట్లు. 
* ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం : రూ. 2650 కోట్లు. 

* పాఠశాల విద్య కోసం : రూ. 10, 421 కోట్లు. 
* ఉన్నత విద్య కోసం : రూ. 1, 723 కోట్లు. 
* వైద్య రంగానికి రూ. 6, 186 కోట్లు. 

* విద్యుత్ రంగానికి రూ. 10, 416 కోట్లు. 
* పారిశ్రామికాభివృద్ధికిరూ. 1, 998 కోట్లు. 
* ఆర్టీసీ కోసం : రూ. 1000 కోట్లు. 

* గృహ నిర్మాణం కోసం : రూ. 11, 917 కోట్లు. 
* హరిత హారం కోసం : రూ. 791 కోట్లు. 
* ఆర్ అండ్ బీ కోసం : రూ. 3, 494 కోట్లు. 
 

* పోలీసు శాఖ కోసం : రూ. 5, 852 కోట్లు. 
* ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీల ప్రత్యేక నిధికి రూ. 480 కోట్లు.
* ఆలయాల అభివృద్ధికి రూ. 500 కోట్లు. 

* ధూపదీప నైవేధ్యాల కోసం రూ. 50 కోట్లు. 
* ఎంబీసీ కోసం రూ. 500 కోట్లు. 
* బస్తీ దవఖానాలు 350కి పెంపు.

* 232 మరో దవాఖానాలు త్వరలో ప్రారంభం.
* 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు.
* 12,427  పరిశ్రమలకు అనుమతులు. 
 

* 14 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు.
* ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు.
* ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి బోర్డు ఏర్పాటు. 

Read More : తెలంగాణ బడ్జెట్..రైతులకు గుడ్ న్యూస్ : రూ. 25 వేలలోపు ఉన్న రుణాలు మాఫీ