గడియారాల గొడవ : ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

చిత్తూరు: చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫోటోతో పంపిణీకి సిద్ధంగా ఉన్న గడియారాల వ్యవహారం కలకలం రేపుతోంది. చెవిరెడ్డిపై అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 01:41 PM IST
గడియారాల గొడవ : ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

చిత్తూరు: చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫోటోతో పంపిణీకి సిద్ధంగా ఉన్న గడియారాల వ్యవహారం కలకలం రేపుతోంది. చెవిరెడ్డిపై అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య

చిత్తూరు: చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫోటోతో పంపిణీకి సిద్ధంగా ఉన్న గడియారాల వ్యవహారం కలకలం రేపుతోంది. చెవిరెడ్డిపై అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి తుడా చైర్మన్ నర్సింహ యాదవ్ ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో లక్ష గడియారాలను చెవిరెడ్డి పంపిణీ చేశారని ద్వివేదికి నర్సింహ యాదవ్‌ ఫిర్యాదు చేశారు. గడియారాలు పంచడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెవిరెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. చెవిరెడ్డి తన ఫొటోలతో గడియారాలను ప్రజలకి పంపిణీ చేశారని చెప్పారు.

 

లక్ష గడియారాలకి గడియారం వెయ్యి చొప్పున అనుకున్నా.. 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయన్నారు. ఆ 10కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెవిరెడ్డి చెప్పాలని నర్సింహ యాదవ్‌ డిమాండ్‌ చేసారు. గడియారాల పంపిణీపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలిని ఈసీని కోరారు. మొన్న వైఎస్‌ జగన్‌ ఓటు 5 వేలకి అడగండి అని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని.. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని నర్సింహ యాదవ్‌ ఈసీని కోరారు.

Also Read: దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

Also Read: డబుల్ హ్యాపీ : ఆమంచి రాజీనామాతో బాబు ఖుషీ